నల్గొండ

ఇంటిపన్నులు తగ్గేంత వరకూ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ: కోదాడ మున్సిపాలిటీ పరిధిలో అశాస్ర్తియంగా పెంచిన ఇంటిపన్నులను తగ్గించేంతవరకు పోరాటం కొనసాగుతుందని అఖిలపక్షనాయకులు, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆదివారం ప్రకటించింది. ఇంటిపన్నులను తగ్గించాలని కోరుతూ కోదాడ మున్సిపాలిటీముందు ఏర్పాటుచేసిన శిబిరంలో అఖిలపక్షం, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ చేస్తున్న ఆందోళనలో భాగంగా నిర్వహిస్తున్న రిలేనిరాహారదీక్షలు ఆదివారం ఆరవ రోజుకు చేరుకొన్నాయి. ఆరవరోజు రిలేనిరాహారదీక్షలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కూర్చున్నారు. దీక్షలను ఉదయం స్ధానిక వైద్యులు డాక్టర్ దశరధనాయక్ ప్రారంభించగా అఖిలపక్షనాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటిపన్నులను తగ్గిస్తూ గెజిట్‌లో ప్రకటన వచ్చేంతవరకు ఆందోళన చేస్తామని ప్రకటించారు. ఇంటిపన్నులను తగ్గించేందుకు మున్సిపాలిటీ పాలకులు, అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని వారు కోరారు. రిలేనిరాహారదీక్షలో కోదాడ నియోజకవర్గ విశ్రాంత ఉద్యోగుల సంఘం అద్యక్షులు రావెళ్ల సీతారామయ్య, విద్యాసాగర్‌రావు, రాంబాబు, యూసుఫ్‌ఖాన్, వెంకట్రావు, పుల్లారెడ్డి, క్రిష్ణమూర్తి, హనుమారెడ్డి, వెంకటేశ్వర్‌రావు, రామారావు, జయరామిరెడ్డి, జీడికల్లు, ఎయల్ నర్సింహారావు కూర్చున్నారు. దీక్షలకు అఖిలపక్షనాయకులు, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ సభ్యులు పైడిమర్రి సత్యబాబు, జుట్టుకొండ బసవయ్య, మేకల శ్రీనివాస్, నూనె సులోచన, యాదా రమేష్, కుక్కడపుప్రసాద్, యం.బసవయ్య, చిలుకూరి శ్రీనివాస్, గంధం బంగారు, పైడిమర్రి వెంకటనారాయణ, కోదండపాణి, వీరేపల్లి రామారావు, హన్మంతరావు,బాబా, గోపాల్, కట్టా సత్తిరెడ్డి, ఆగమయ్య, రావెళ్ల రవి, డాక్టర్ శ్రీపతిరెడ్డి, కోదాడ పబ్లిక్ క్లబ్ అద్యక్ష, కార్యదర్శులు ఈదర సత్యనారాయణ, గడ్డం విద్యాసాగర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు.