నల్గొండ

నేటి నుండి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలెక్టరేట్(నల్లగొండ): జిల్లా వ్యాప్తంగా నేడు సోమవారం నుండి ఏప్రిల్ 8వరకు పదవ తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మొత్తం 48,998మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో 25,066మంది బాలురు, 23,932మంది బాలికలు ఉన్నారు. ఉదయం 9-30నుండి మధ్యాహ్నం 12-15వరకు పరీక్షలు జరుగనున్నాయి. 9-35గంటల వరకు పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు. పరీక్ష కేంద్రాల వద్ధ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 144సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఆర్టీసీ యంత్రాంగం తగిన బస్ సర్వీస్‌లను ఏర్పాటు చేసింది. ప్రైవేటు విద్యాసంస్థలు సొంత వాహనాలను సమకూర్చుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 220పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 225చొప్పున చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమించారు. మరో 17మంది అదనపు డిపార్ట్‌మెంట్ అధికారులు, 14్ఫ్లయింగ్ స్క్వాడ్‌లను, 30సిట్టింగ్ స్క్వాడ్‌లను, 2500మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్ధినిలను తనిఖీ చేసేందుకు మహిళా కానిస్టేబుల్స్, హోంగార్డు, మహిళా ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లను నిషేధించారు. పరీక్షల సమయంలో జీరాక్స్ సెంటర్లను మూసి వేయనున్నారు. పేపర్ లీక్, మాస్ కాపియింగ్ తలెత్తకుండా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎక్కడైన నేలపైన కూర్చుని విద్యార్థులు పరీక్షలు రాస్తే సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేస్తామంటు జెసి ఎన్. సత్యనారాయణ, ఏజెసి వెంకట్రావు, డిఈవో విశ్వనాథరావులు ప్రకటించారు. కాగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు పరీక్షల వేళ విద్యార్థులకు ఫీజుల పేరుతో హాల్‌టికెట్లు ఇవ్వకపోవడం విద్యార్థులను, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేసింది.