నల్గొండ

మోదీ లాంటి ఏకవ్యక్తి పాలన ఎక్కడా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూలై 5: ప్రధాని నరేంద్రమోదీ లాంటి ఏకవ్యక్తి పాలన ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగడం లేదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం దేవరకొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన మంత్రి వర్గంలోని ఏ మంత్రికి పని చేసే అవకాశం కల్పించకుండా అసమర్ధులను మంత్రి వర్గంలో నుండి తొలగించి సమర్ధులకు మత్రివర్గంలో స్ధానం కల్పించానని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దళితులను కుక్కలతో పోల్చిన వికె సింగ్‌ను మోడీ ఎందుకు మంత్రి వర్గం నుండి తొలగించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని హోదాలో విదేశాలకు వెళ్ళిన సమయంలో విదేశాంగమంత్రిని, వాణిజ్యశాఖ మంత్రులను మోదీ తనతో పాటుగా తీసుకెళ్ళకుండా ఇతర దేశాలతో ఎలా ఒప్పందాలు చేసుకుంటారని సురవరం ప్రశ్నించారు. త్వరలో జరగనున్న రాష్ట్రాల్లో ఎలాగైనా ఓట్లు సాధించాలన్న లక్ష్యంతోనే ప్రధాని మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించారని ఆరోపించారు. మోదీ మంత్రవర్గంలో భజనపరులకే అవకాశం కల్పించారని సురవరం ఆరోపించారు. 70 సంవత్సరాలు దాటిన వారికి తన మంత్రివర్గంలో అవకాశం ఉండదని చెప్పిన మోదీ 70 సంవత్సరాలు దాటిన వెంకయ్యనాయుడిని ఎలా కొనసాగిస్తున్నారని సురవరం నిలదీశారు. మోదీని దేవదూతగా ప్రచారం చేసినందుకే వెంకయ్యనాయుడుని మోదీ మంత్రివర్గంలో ఉంచుకున్నాడని సురవరం ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో మతపరమైన చీలికలు తీసుకొచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యం తోనే యుపిలో ఓటుబ్యాంక్ ఉన్న వారికి మంత్రి వర్గంలో స్ధానం కల్పించాడని విమర్శించారు.
హైకోర్టు విభజన చేయాలన్న న్యాయమూర్తులు, న్యాయవాదుల డిమాండ్‌కు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని సురవరం చెప్పారు. హైకోర్టు విభజన విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చిత్తశుద్ధిలేదని ఆయన ఆరోపించారు. తన కూతురు కవితను కేంద్రమంత్రి వర్గంలో చేర్పించాలని కెసిఆర్ చేసిన ప్రయత్నంలో పదోవంతు ప్రయత్నమైనా హైకోర్టు విభజన కోసం చేస్తే ఇప్పటికే హైకోర్టు విభజన పూర్తయి ఉండేదని సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. 1953లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు టెంట్‌లలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి కార్యకలాపాలను నిర్వహించారని ఆయన చెప్పారు. హైకోర్టులో 35 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా కేవలం 21 మంది మాత్రమే ఉన్నారన్నారు. వీరిలో 18 మంది ఆంధ్రప్రాంతానికి చెందిన జడ్జిలు ఉండగా కేవలం నలుగురు జడ్జిలు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారని ఆయన చెప్పారు. దీనినిబట్టే న్యాయశాఖలో తెలంగాణకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నాడన్న అనుమానాలు వస్తున్నాయని సురవరం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని సురవరం సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, పల్లా నర్సింహ్మారెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, కలకొండ కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.