నల్గొండ

16మంది అధికారులకు షోకాజ్ నోటీస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ హరిత హారంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు, ఇద్దరు మంత్రులు సమీక్షా సమావేశానికి హాజరుకాని 16మంది జిల్లా అధికారులకు ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ షోకాజ్ నోటీస్‌లు జారీ చేశారు. ముందస్తు సమాచారం అందించినప్పటికి ఈ సమావేశానికి సంబంధిత అధికారిగాని, కార్యాలయం సిబ్బందిగాని ఎవ్వరిని పంపించలేదని, ఇందుకు డిఎంహెచ్‌వో, డిసిహెచ్‌ఎస్, డిసివో, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, డిటిసి, పశుసంవర్ధక శాఖ జెడి, లేబర్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కమిషనర్, మాడా పివో, మైనార్టీ కార్పోరేషన్ ఏడి, ఎఫ్‌ఎస్‌వో, ఫిషరీస్ డిడి, వయోజన విద్య డిడి, సోషల్ వెల్ఫర్ టిఎస్‌ఆర్.ఎస్‌ఈఈ ఈఈ, స్పెషల్ కలెక్టర్, జిల్లా ఫైర్ అధికారి, జిల్లా ఆడిట్ అధికార్లకు షోకాజ్ నోటీస్‌లు జారీ చేసినట్లుగా ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.