నల్గొండ

పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జూలై 19: నాగార్జునసాగర్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిలు మంగళవారం నాడు ప్రారంభించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం స్థానిక బుద్ధవనంలోని హెలిప్యాడ్‌లో దిగిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి డిజిపి అనురాగ్‌శర్మ, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ, నల్లగొండ జిల్లా ఎస్‌పి ప్రకాశ్‌రెడ్డిలు స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా నూతన పోలీస్‌స్టేషన్ భవనానికి చేరుకున్న తరువాత నూతన పోలీస్‌స్టేషన్ భవనంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పోలీసు వందనాన్ని స్వీకరించారు. అనంతరం పూజా కార్యక్రమాన్ని నిర్వహించి నూతన పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సమావేశంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, డిజిపి అనురాగ్‌శర్మలు మాట్లాడారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక బిసి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో భాగస్వామ్యమై మొక్కలు నాటారు. ఈసందర్భంగా విద్యార్థులతో కొంతసేపు మంత్రులు ముచ్చటించారు. అనంతరం నల్లగొండ జిల్లా పోలీస్‌శాఖ ఏర్పాటుచేసిన పుష్కరభక్తులకు మరియు విధులు నిర్వహించు సిబ్బందికి సూచనలు తెలిపే పుస్తకాన్ని, కరపత్రాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో అడిషనల్ డిజిపి అకున్ సబర్వాల్, ఐజి నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజి శివధర్‌రెడ్డి, ఐజి మల్లారెడ్డి, మహబూబ్‌నగర్ కలెక్టర్ శ్రీదేవి, ఎస్‌పి రమారాజేశ్వరి, నల్లగొండ జిల్లా ఎస్‌పి ప్రకాశ్‌రెడ్డి, ఇంచార్జి కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్, పెద్దవూర ఎంపిపి వస్తపూరి మల్లిక, ఆర్డీఓ కిషన్‌రావు, అడిషనల్ ఎస్‌పి గంగారాం, జడ్‌పి వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మిర్యాలగూడ డిఎస్‌పి రామ్‌గోపాల్‌రావు, హాలియా సిఐ పార్థసారధి, ఎస్‌ఐలు రజనీకర్, సురేశ్, ప్రసాద్‌లు పాల్గొన్నారు.
దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్-1: హోంమంత్రి నాయిని
దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ నెంబర్-1 స్థానంలో నిలిచిందని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌లో మంగళవారం నూతన పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ ఒన్‌గా ఉన్నారని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందన్నారు. తెలంగాణ పోలీసు శాఖ నూతన సాంకేతిక విధానాన్ని కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎ-గ్రేడ్ పోలీస్‌స్టేషన్‌కు రూ.75వేలు, బి-గ్రేడ్ పోలీస్‌స్టేషన్‌కు రూ.55వేలు నెలకు ఖర్చుల నిమిత్తం మంజూరుచేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పోలీస్‌శాఖ ప్రజలలో మమేకమై పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. గోదావరి పుష్కరాలు విజయవంతమైనట్లుగానే కృష్ణా పుష్కరాలు సైతం విజయవంతమయ్యేలా పోలీసు ఉన్నతస్థాయి అధికారుల నుండి కానిస్టేబుల్ స్థాయి వరకు కూడా వాలీంటర్లుగా పనిచేస్తారన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులు ఆన్‌లైన్ విధానంలో పెట్టేవిధంగా ఏర్పాటుచేశామన్నారు. టెర్రరిజం, గూండాయిజం అదుపుచేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.