నల్గొండ

180 సిసి కెమెరాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 19 : జిల్లాలో ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పోలీసు శాఖ 6,751 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తుందని ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పుష్కరాల బందోబస్తు ఏర్పాటు వివరాలను వెల్లడించారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 16 మంది డి ఎస్పీలు, 95 మంది సి ఐలు, 437 మంది ఎస్ ఐలు, ఇతర సిబ్బంది 6,201 మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. పుష్కరఘాట్లు, దేవాలయాలు, పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు వద్ద 50 లక్షల వ్యయంతో 180 సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో పుష్కరాల యాప్‌ను ఏర్పాటు చేస్తున్నట్తు తెలిపారు. ప్రతి 20 కిలోమీటర్ల వరకు మోబైల్ పెట్రోలింగ్ బృందం, పుష్కరఘాట్ల వద్ద కంట్రోల్ రూంలు, సహాయ కేంద్రాలు, వైద్య సేవాకేంద్రాలు, 108, అంబులెన్స్, 1033 సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 120 కిలోమీటర్ల మేర 9 మండలాల్లో కృష్ణానది ప్రవహిస్తుందని, 28 ఘాట్లు ఏర్పాటు చేయగా 1 కోటి 50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశామని తెలిపారు. తెలంగాణ హరితహారంలో భాగంగా పోలీసు శాఖ 4 లక్షల మొక్కలు నాటడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. మరో రెండు లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేపట్టామన్నారు.