నల్గొండ

వనం కోసం మనంలా హరిత ఉద్యమం సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూలై 19 : పర్యావరణ పరిరక్షణ వాతావరణ కాలుష్యాన్ని తగిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకునేందుకు వనం కోసం మనంలా హరిత ఉద్యమం కొనసాగాలని డ్రగ్స్ కంట్రోల్ ఏడి అంజుమ్ అబిదా బేగం సూచించారు. మంగళవారం స్దానిక 39వ వార్డులో కౌన్సిలర్ రావుల శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలోమున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్, కామినేని ఆసుపత్రి జనరల్ మేనేజర్ శ్రీ్ధర్‌రెడ్డి, డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు గోవింద్ సింగ్, శ్రీకాంత్, సంపత్‌ల సూచనలతో వెంకటేశ్వర, నలంద, రామానందతీర్ధ ఫార్మసీ కళాశాలల విద్యార్ధులచే మొక్కలు నాటించారు. అదేవిధంగా జిల్లా కేంద్ర ఆసుపత్రి ప్రాంగణంలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్యమిత్రల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు, ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ కొమ్ము ప్రసాద్, మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సిరిప్రోలు వెంకటపతి, కళాశాల డైరెక్టర్ రాంప్రసాద్, పరమాత్మ, శ్రీనివాస్, నలంద శ్రీనివాస్, గండూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పుష్కరాలకు 6,751 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు