నల్గొండ

పుష్కరాలకు సమన్వయంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జూలై 19: కృష్ణాపుష్కరాల సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని విద్యుత్‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. విజయవిహార్‌లో పుష్కరాల సందర్భంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ఎస్‌పిలు, కలెక్టర్లు, ఇరిగేషన్, పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఇతర ఉన్నతాధికరులతో పుష్కరాలపై సమీక్షాసమావేశం నిర్వహించారు. కృష్ణానది వేగంగా ప్రవహిస్తుందని, పుష్కరాల సమయంలో భక్తులకు ఎటువంటి నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, దీనికై కావాల్సిన అన్ని చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుష్కర భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 31లోపు పుష్కర పనులు పూర్తయ్యేలా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు ఆలస్యమవుతున్న చోట వేగవంతమయ్యేలా చూడాలనిఅన్నారు. ఆయనతోపాటు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపి అనురాగ్‌శర్మ, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు సత్యనారాయణ, శ్రీదేవి, ప్రకాశ్‌రెడ్డి, రమారాజేశ్వరి, ఐజిలు మల్లారెడ్డి, శివధర్‌రెడ్డి, నాగిరెడ్డి, అకున్ సబర్వాల్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్ ఎస్‌ఇలు ధర్మానాయక్, రమేశ్, మహేశ్‌నాయక్‌లు పాల్గొన్నారు.