నల్గొండ

అందరి భవితకే హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 19: ప్రజలందరి భవిష్యత్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డిలు అన్నారు. మంగళవారం వారు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయ ప్రాంగణంలో 47ఎకరాలలో 1కోటి 50లక్షలతో ఏర్పాటు చేసిన నీలగిరి నందన వనం పార్క్‌ను వారు ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతు రాష్ట్రంలో ఇప్పటికే 10కోట్ల 50లక్షల మొక్కలు నాటడం జరిగిందని, వర్షాలు పడివుండే ఇప్పటికే 20కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకునే వారిమన్నారు.కనీస అటవీ విస్తీర్ణం 33శాతం కంటే తక్కువగా కేవలం 5.8శాతం అడవులు మాత్రమే నల్లగొండ జిల్లాలో ఉండటంతో జిల్లా కరవు బారిన పడుతుందన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలంతా హరిత హారం కార్యక్రమంలో భాగస్వాములై తమ భవిష్యత్‌ను బాగు చేసుకునేందుకు వర్షాల సాధనకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతర యజ్ఞంలా కొనసాగించాలన్నారు.
మంత్రి జి.జగదీష్‌రెడ్డి మాట్లాడుతు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు హరిత హారంకు ఆటంకంగా మారిన ఉద్యమంల ప్రజలు మొక్కలు నాటేందుకు ముందుకు రావడం హర్షనీయమన్నారు. వర్షాలు పడిన వెంటనే మొక్కలు నాటాలని, జాతీయ రహదారి వెంట ఎండిన మొక్కల స్థానంలో నూతన మొక్కలు నాటిస్తామని, సంరక్షణ చర్యలను ఉపాధి హామీ కూలీలకు అప్పగించి నీళ్లు పోయిస్తామన్నారు. ప్రస్తుతం 43ట్యాంకర్లతో మొక్కలకు నీళ్లు అందిస్తున్నామన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 25లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అనంతరం మంత్రులిద్ధరు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరిత హారం పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్యకార్యదర్శి ఫర్గీన్, సిసిఎఫ్ సదానందా, పిసిసిఎఫ్ పికె.ఝా, ఐఎఫ్‌ఎస్ నాగభూషణం, ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ, ఎజెసి వెంకట్రావు, డిఎఫ్‌వో సుదర్శన్‌రెడ్డి, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, ఎఫ్‌ఆర్‌వో సత్యనారాయణ, ఆర్‌ఎఫ్‌వో వెంకటేశ్వర్లు, సత్యనారాయణ పాల్గొన్నారు.