నల్గొండ

నాటిన ప్రతి మొక్కను సంరక్షించి బ్రతికించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, జూలై, 19: హరితహారం కార్యక్రమంలో జాతీయ రహదారి వెంబడి నాటిన మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలను తీసుకోవాలని నాటిన ప్రతి మొక్కను సంరక్షించడమేకాకుండా బ్రతికించాలని రాష్ట్ర అటవీశాఖా మంత్రి జోగు రామన్న అన్నారు. మండలంలోని గుండ్రాంపల్లి శివారులో ఈనెల 8న సిఎం కెసిఆర్ నాటిన మొక్కను, రహదారి వెంబడి నాటబడిన మొక్కలను, ఎండిపోయిన మొక్కలను మంగళవారం అదనపు పిసిసిఎం మల్లార్సి, హరితహారం జిల్లా ఇన్‌చార్జి ఫణిగర్, జిల్లా అటవీశాఖ అధికారి మాధవరావు, సెక్షన్ అధికారి శేఖర్‌రెడ్డి ఇతర అధికారులతో కలిసి మంత్రి జోగు రామన్న పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనసంపదను పెంపొందించుకునేందుకు వాతావరణ సమతుల్యతను పరిరక్షించుకుని సకాలంలో వర్షాలు వచ్చేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. హరితహారం కార్యక్రమం 2వ విడత జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం నుండి ప్రారంభించారని సిఎం కార్యక్రమం ప్రారంచగానే రాష్టవ్య్రాప్తంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అంతేకాకుండా సిఎం మొక్కను నాటడంతో ఒకే సారి 153 కిలోమీటర్లు ఉన్న 65వ నెంబరు జాతీయ రహదారి వెంబడి ఇరువైపులా లక్షలాది మొక్కలను నాటారని ఇంత పొడవున ఒకేసారి ఎక్కడ కూడా మొక్కలను నాటిన సందర్భాలు లేవని ఆఘనత మనకే దక్కిందన్నారు. రహదారి వెంబడి నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టడం జరుగుతుందని నాటిన మొక్కలన్నింటిని సంరక్షించేందుకుగాను తగిన సిబ్బంది ఏర్పాటు చేస్తున్నామని మొక్కలన్నింటికి నీటినందించి బ్రతికించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రహదారి వెంబడి నాటిన మొక్కల్లో కొన్ని మొక్కలు ఎండిపోయాయని ఎండిన మొక్కలను తొలగించి ఇతర మొక్కలను నాటాలని అటవీశాఖ సిబ్బందిని మంత్రి ఆదేశించారు. రహదారి పొడవునా ఎక్కడ చూసినా ఎండిన మొక్క కనబడకూడదని నాటిన స్థానంలోని మొక్కల ఎండినట్లయితే వాటిని కనిపెట్టి తొలగించి ఇతర మొక్కలను నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రం వర్షాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రంలోని ప్రజలంతా ప్రతి ఒక్కరు ఇంటంటికి మొక్కలను నాటాలని నాటిన మొక్కలను సంరక్షించుకుని చెట్లుగా పెంచి వనసంపదను పెంపొందించుకుని వర్షాలను రప్పించాలన్నారు. చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్లుగా వనసంపద పెద్దఎత్తున సమకూరినట్లయితే సకాలంలో వర్షాలు వస్తాయని గ్రామాల్లోని చెరువులు కుంటలు వర్షపునీటితో నిండి వ్యవసాయానికి సాగునీరందుతుందని తాగునీటికి ఎలాంటి కష్టాలురావని అన్ని విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ప్రతి ఒక్కరు హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటి చెట్లను పెంచాలని మొక్కలను నాట చెట్లుగా పెంచడం బాద్యతగా తీసుకోవాలని కోరారు.