నల్గొండ

ఆర్టీసీ ఎన్నికల్లో టిఎంయుదే హవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 19: ఆర్టీసి ఎన్నికల్లో టిఎంయు కార్మిక సంఘం సత్తా చాటుకుంది. జిల్లా పరిధిలోని ఏడు డిపోల్లోనూ టిఎంయు జయకేతనం ఎగురవేసింది. ఏడు డిపోల్లో రాష్ట్ర స్థాయి, నల్లగొండ రీజియన్ స్థాయికి సంబంధించిన మొత్తం 14స్థానాల్లోనూ, ఆర్‌ఎం కార్యాలయం రెండు స్థానాల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అన్ని డిపోల్లోనూ కార్మికులు టిఎంయుకు పూర్తి స్థాయి మెజార్టీ కట్టబెట్టి సింహభాగం ఓట్లను వేశారు. రీజియన్ స్థాయిలో ఏడు డిపోల్లో మొత్తం 3161ఓట్లకుగాను టిఎంయు 2,280ఓట్లు, రాష్ట్ర స్థాయిలో 2,207ఓట్లు పొందడం విశేషం. ఈయు 682, 765, ఎన్‌ఎంయు 166, 135ఓట్లు సాధించాయి.
సూర్యాపేట డిపోలో నల్లగొండ రీజియన్, తెలంగాణ స్థాయి ఎన్నికలలో రెండు స్థానాలను కూడా టిఎంయు విజయం సాధించింది. పోలైన 459ఓట్లలో రీజియన్ స్థానంలో టిఎంయు 294, రాష్ట్ర స్థానంలో 322ఓట్లు సాధించగా, ఈయు-ఎస్‌డబ్ల్యుఎఫ్ కూటమి 108, 94ఓట్లు సాధించింది. ఎన్‌ఎంయు 40, 38ఓట్లు సాధించింది.
దేవరకొండ డిపోలో మొత్తం పోలైన 440ఓట్లలో రీజియన్‌లో టిఎంయ 349, రాష్ట్ర స్థాయిలో 357, ఈయు-ఎస్‌డబ్ల్యుఎఫ్ 79, 73, ఎన్‌ఎంయు 7,7ట్లు సాధించింది.
యాదగిరిగుట్ట డిపోలో 479ఓట్లు పోలవ్వగా రీజియన్‌లో టిఎంయుకు 301ఓట్లు, రాష్ట్ర స్థాయిలో 329ఓట్లు, ఈయు-ఎస్‌డబ్ల్యుఎఫ్‌కు 144, 133, ఎన్‌ఎంయుకు 20, 13ఓట్లు సాధించాయి. మిర్యాలగూడలో పోలైన 469ఓట్లలో రీజియన్‌లో టిఎంయు 293, రాష్ట్ర స్థాయిలో 270, ఈయు-ఎస్‌డబ్ల్యుఎఫ్ 128, 191, ఎన్‌ఎంయు 41, 3ఓట్లు సాధించింది.
కోదాడ డిపోలో పోలైన 411ఓట్లలో టిఎంయు రీజియన్‌లో 302, రాష్ట్ర స్థాయిలో 290, ఈయు-ఎస్‌డబ్ల్యుఎఫ్ 98, 102, ఎన్‌ఎంయు 8, 8ఓట్లు సాధించింది.
నార్కట్‌పల్లి డిపోలో పోలైన 270ఓట్లలో రీజియన్ స్థాయిలో టిఎంయు 212, రాష్ట్ర స్థాయిలో 222ఓట్లు సాధించగా, ఈయు-ఎస్‌డబ్ల్యుఎఫ్ 55, 46, ఎన్‌ఎంయు ఆరు చోప్పున ఓట్లు సాధించింది.
నల్లగొండ డిపోలో పోలైన 597ఓట్లలో టఎంయు రీజియన్‌లో 444ఓట్లు, రాష్ట్ర స్థాయిల 436, ఈయు-ఎస్‌డబ్ల్యుఎఫ్ 88, 98ఓట్లు, ఎన్‌ఎంయు 51, 53ఓట్లు సాధించింది. ఆర్‌ఎం కార్యాలయం మొత్తం 32ఓట్లలో టిఎంయుకు రీజియన్‌లో 31ఓట్లు, రాష్ట్ర స్థాయిలో 30ఓట్లు సాధించి పూర్తి ఆధిక్యత సాధించడం విశేషం.