నల్గొండ

ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్‌లో కార్మికులు మందు తాగి హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, జులై 20:యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్టాండ్ సైకిల్ పార్కింగ్ లో పట్టపగలే టిఎమ్‌యు ఆర్టీసీ కార్మిక నాయకులు మద్యం సేవిస్తూ హల్‌చల్ చేస్తున్నారన్న సమాచారంతో అక్కడకు చేరుకుని ఫోటోలు తీస్తున్న విలేఖరులపై దురుసుగా ప్రవర్తించటమే కాకుండా నానా దుర్భాషాలాడిన టిఎమ్‌యు ఆర్టీసీ కార్మికులపై చర్య తీసుకోవాలని బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖరులు ఫిర్యాదు చేసారు. అనునిత్యం వేల సంఖ్యలో గుట్టకు వస్తున్న భక్తుల, స్థానికులకు ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన కార్మిక నాయకులే పట్ట పగలు ఆర్టీసీ సైకిల్ పార్కింగ్‌లో మద్యం సేవిస్తూ ఉండటంతో చిత్రీకరించేందకు వెళ్ళిన విలేఖరులపై మద్యం మత్తులో అసభ్య పదజాలలతో దురుసుగా ప్రవర్తించి, నానా దుర్భాషాలాడారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహన పార్కింగ్‌లోని మద్యం బాటిళ్ల, వాటర్ బాటిళ్లు, తిను బండారాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వచ్చారన్న సమాచారంతో కార్మికులు అక్కడి నుండి జారుకున్నారు. తలపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసి వారిపై తగు చర్య తీసుకోవాలని విలేఖరులు గుట్ట ఎసై కి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు రాగీరు పాండు, గుండ్లపల్లి శ్రీరామ్,సంపత్, ఉపేందర్, కీసరి కిషన్, మహేష్, నరేష్, వెంకటేష్, బాను, హరి, శివ, గిరి, నరేందర్ పాల్గొన్నారు.

పంచాయతీలు,
మండలాలు, జడ్పీల్లో
లక్షన్నర లక్ష్యం
హరితహారంలో జడ్పీ సిఇఓ మనోహర్‌రెడ్డి

మిర్యాలగూడ టౌన్, జూలై 20: జిల్లాలోని గ్రామపంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో హరితహారం కింద సుమారు లక్షన్నర మొక్కలు నాటడం బుధవారం రోజు లక్ష్యమని జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్యాలయాలు, గ్రామంలోని రోడ్లపై ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నామని, మండలాలు, పంచాయతీలు తిరిగి పర్యవేక్షిస్తున్నానని ఆయన అన్నారు. మొక్కలు నాటడంలో గ్రామ ప్రజలు ముందుండాలని, జిల్లాకు రాష్ట్ర ఆర్థిక సంఘం నుండి 2.5 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని అన్నారు. వీటితో అభివృద్ధి, సంక్షేమ పనులు చేపడ్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ఒగ్గు జానయ్య, జడ్పిటిసి ఎం.నాగలక్ష్మి, ఎంపిడిఓ సోము వెంకట్‌రెడ్డి, సూపరింటెండెంట్ పి.సుధాకర్‌రెడ్డి, ఇఓపిఆర్‌ఆర్డీ శ్రీనివాసరావు, మాజీ ఎంపిపి పేలపోలు తిరుపతమ్మ, కోఆప్షన్ సభ్యుడు షంషుద్దీన్‌లు పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని యూనాని డిస్పెన్సరిలో వైద్యాధికారి డాక్టర్ ఎఎ.ఖాన్ మొక్కలను నాటారు. కార్యక్రమంలో డిపిఎంఓ ప్రసాద్, ఫార్మసిస్టు పురుషోత్తం, ఎంపిహెచ్‌ఎస్ మదార్‌బీ, స్ట్ఫా నర్సు సైదమ్మలు పాల్గొన్నారు. పట్టణంలోని రాంనగర్ సరస్వతి శిశుమందిర్‌లో బిజెవైఎం ఆధ్వర్యంలో బిజెపి నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుపల్లి చంద్రవౌళి, జిల్లా ఉపాధ్యక్షులు బంటు సైదులు, పట్టణ ప్రధాన కార్యదర్శులు కమలాకర్‌రెడ్డి, చిలుకూరి శ్యాం, శ్రీను, రాజిరెడ్డి, నాగయ్య, పోరెడ్డి శ్రీను, బంటు గిరి, మండల సోములు, పూర్ణ, శంకర్, పృధ్వీ, శివ, వెంకటేశ్, బాలు, ధనుంజయ, మనిపాల్ సంపత్‌లు మొక్కలు నాటారు. పట్టణంలోని రవీందర్‌నగర్‌లో టిఆర్‌ఎస్ యూత్ నాయకులు గోన అనిల్‌రావు, అంజి, సతీష్, వినయ్, కొండల్, ఫైజాన్, నిహాల్, స్వరూప్, ప్రదీప్, భరత్‌నాయక్‌లు మొక్కలు నాటారు.

ఇంటిముందు మొక్కల బాధ్యత ఇంటివారిదే
ఛైర్‌పర్సన్ అనిత
కోదాడ, జూలై 20: కోదాడ పట్టణాన్ని హరితమయం చేయాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ వంటిపులి అనిత నాగరాజు బుధవారం పట్టణంలో ఇల్లిల్లు తిరిగి మహిళలకు బొట్లు పెట్టి మరీ పండ్లమొక్కలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీ తోపుడు బండిలో పండ్ల మొక్కలను వుంచుకొని ఛైర్‌పర్సన్ అనిత ఇల్లిల్లు తిరుగుతూ మొక్కలను పంపిణీ చేయడంతో ప్రజల్లో హరితహారం విజయవంతం చేయాలనే సంకల్పం ఏర్పడింది. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ అనిత మాట్లాడుతూ ఇంటిముందు నాటుతున్న మొక్కల సంరక్షణ బాధ్యత ఇంటివారిదేనని స్పష్టం చేశారు. మొక్కలును పెంచడం వలన కాలుష్యరహిత సమాజం ఏర్పడుతుందని ఆమె చెప్పారు. పండ్ల మొక్కలను ఇండ్లలో వేసుకొని పెంచడం వలన భవిష్యత్తులో అవి పిల్లలు తినేందుకు ఫలాలను ఇస్తాయని ఆమె హితవుచెప్పారు. పట్టణంలోని 2, 16, 17, 18 వార్డుల్లో ఛైర్‌పర్సన్ అనిత ఇంటింటికి పండ్ల మొక్కల పంపిణీ చేయడంతోపాటు మొక్కలను నాటారు. కార్యక్రమంలో కమీషనర్ అమరేందర్‌రెడ్డి, వైస్‌ఛైర్మన్ తెప్పని శ్రీనివాస్, కౌన్సిలర్‌లు రెహనా ఉద్దండు, కలకొండ శ్రీను, కుడుముల లక్ష్మినారాయణ, కొమరగిరి రంగారావు, అజ్మత్‌షమ్మి, బాగ్దాద్, మున్సిపల్ అధికారులు సత్యారావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కోదాడలోని పేదరిక నిర్మూలనసంస్ధ కార్యాలయంలో యండివో ప్రేమకరణ్‌రెడ్డి మొక్కలు నాటగా ఇవోఆర్‌డి సాంబిరెడ్డి, ఎపియం వీరబాబు, ఉమ, బేబి షాలినీ, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని దోరకుంట గ్రామంలో నిర్వహించిన హరితహారంలో యంపిపి డేగ రాణి, యండివో, సర్పంచ్ గద్దల పుష్పమ్మ వెంకటేశ్వర్లు, యంపిటిసి ముండ్రా భాగ్యమ్మ, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. తమ్మర హైస్కూల్‌లో గ్రామసర్పంచ్ సుల్తాని కోటయ్య, ఉపసర్పంచ్ బత్తినేని హన్మంతరావు, యంపిటిసి రమేష్, హెడ్మాస్టర్ వసంత, గ్రామపోలీస్ వెంకటరమణ తదితరులు మొక్కలు నాటారు. కోదాడ 23వ, వార్డులో మాజీ సర్పంచ్ యెర్నేని బాబు, డిసిసిబి డైరెక్టర్ గరిణె కోటేశ్వర్‌రావు, రాయపూడి వెంకటనారాయణ, లక్ష్మినారాయణ, యన్‌యస్‌పి క్యాంప్ కార్యాలయంలో, సాగర్ కాలువలపై యన్‌యస్‌పి యస్‌ఇ అంజయ్య, ఇఇ రత్తయ్య, డిఇ యలమందయ్య, ఎఇ దుర్గయ్య, గుడుగుంట్ల అప్పయ్య వృద్ధాశ్రమంలో కోదాడ మెడికల్ షాప్స్ అసోసియేషన్ అద్యక్షులు పైడిమర్రి నారాయణరావు, సాంబిరెడ్డి, జాస్తి నాగేశ్వర్‌రావు, హరినాధబాబు, యాదా శ్రీను తదితరులు మొక్కలు నాటారు.

పుష్కరఘాట్లను పరిశీలించిన ఐబి అధికారులు
దామరచర్ల, జూలై 20: వాడపల్లి వద్దగల పుష్కరఘాట్లను (ఇరిగేషన్ అండ్ వంతెనల శాఖ) ఐబి ఇఇ ధర్మానాయక్ బుధవారం పరిశీలించారు. ఘాట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. సుమారు రూ.6కోట్ల వ్యయంతో నిర్మించే శివాలయం ఘాట్ పనులు 80శాతం పూర్తయ్యాయని ఈనెల 25లోగా పూర్తిస్థాయిలో ఘాట్ నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. వాడపల్లిలోని ఎనిమిది పుష్కరఘాట్లను వేగవంతంగా పనులు జరుగుతున్నాయని అన్ని ఘాట్లను ఈనెల 25లోగా పూర్తిచేయిస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో 28ఘాట్లల్లో 80శాతం పనులు పూర్తయ్యాయని సిసిరోడ్లు పనులు 90శాతం పూర్తయ్యాయని, పుష్కరఘాట్లకు అనుసంధానంగా నిర్మించే సిసిరోడ్ల ద్వారా భక్తులు ప్రతి ఒక్కఘాట్‌కు వెళ్లే అవకాశం ఉందని, వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట డిఇ మురళి, ఎఇ జనార్ధన్ తదితరులు ఉన్నారు.
మొక్కలు జీవకోటికి ఆధారం : ఎమ్మెల్యే
భూదాన్ పోచంపల్లి, జూలై 20 : మొక్కలు జీవుల మనుగడకు ఆధారమని పచ్చదనం పెంచితేనే ప్రగతి సాధ్యమవుతుందని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్‌రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పోవాలంటే మొక్కలు పెంచడమే లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రలజందరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సరస్వతి, జడ్పిటిసి ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, కొమరయ్య, గుత్తా నరేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, రవీందర్, నాయకులు భూపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, శేఖర్‌రెడ్డి, రవి, జంగారెడ్డి, సత్యనారాయణ, బాలమణి, జ్యోతి, చాంద్‌పాశ, శ్రీశైలం, సత్యనారాయణ, ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.
సాదాబైనామా దరఖాస్తులపై
సమగ్ర చర్యలు చేపట్టాలి : రాజీవ్ శర్మ
నల్లగొండ టౌన్, జూలై 20 : సాదా బైనామా రిజిస్ట్రేషన్ల కొరకు వచ్చిన దరఖాస్తులపై తీసుకోవాల్సిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జాయింట్ కలెక్టర్లకు వివరించారు. బుధవారం హైద్రాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయాన జాయింట్ కలెక్టర్లతో మాట్లాడుతూ జిల్లాకు వచ్చిన సాధా బైనామా దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమీక్షించి వచ్చే వీడియో కాన్ఫరెన్సు నాటికి పూర్తిస్ధాయిలో పనులు చేపట్టాలన్నారు. ఆర్ ఓ ఆర్ చట్టంలో ఉన్న గైడ్‌లైన్లను అమలు చేయాలన్నారు. లబ్దిదారులకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు అనర్హులను ఏరివేయాలని అధికారులకు సూచించారు. ఇంచార్జీ కలెక్టర్ ఎన్.సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు లక్షా 34 వేల 847 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 88,037 దరఖాస్తులు పరిశీలించడం జరిగిందని 11వేల 74 మందికి నోటీసులు జారీ చేయగా 1790 దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందన్నారు. 5 మండలాల్లో కంప్యూటర్ల సాంకేతిక సమస్య కారణంగా సర్వే నెంబర్లు అప్‌లోడ్ కావడం లేదని, మిగిలిన దరఖాస్తులను 10లోగా పూర్తి చేస్తామని వివరించారు. ప్రభుత్వ, దేవాలయాలు, భూదాన్ భూములు ఉన్న ప్రదేశాలలో దరఖాస్తులు పరిశీలించగా 30శాతం వరకు ఉన్నాయని వివరించారు. జిల్లాలోని 59 మండలాల్లో 13 మండలాలు పూర్తిస్ధాయిలో దరఖాస్తులను పరిశీలించినట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో సర్వే ల్యాండ్ కమీషనర్ శశిధర్, డిఆర్‌ఓ రవినాయక్, గణపతిరావు, తదితరులు పాల్గొన్నారు.