నల్గొండ

ప్రశ్నించే మనస్తత్వమే వికాసానికి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 22: ప్రశ్నించే మనస్తత్వమే విజ్ఞాన, వికాసాలకు మూలమని విద్యార్థులు ప్రశ్నించే గుణాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతు దేశానికి ప్రశ్నించడం నేర్పింది నల్లగొండ జిల్లాయని, మొదటి నుండి ఈ జిల్లాకు అది సహజ గుణంగా ఉందన్నారు. ఎదుటివారిని ఆలోచింపచేసేలా చైతన్యం కల్గించే ప్రశ్నలు ఎప్పుడు నేరంకావన్నారు. లక్షమందికి పైగా విద్యార్థులు సమాజంలో వివిధ రంగాల్లో నిష్ణాతులుగా అందించిన చరిత్ర ఎన్‌జి కళాశాల సొంతమన్నారు. దేశ విదేశాల్లో కళాశాల విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగారని, విద్యార్థులకు కళాశాలలో నేర్చుకునే అంశాలు సమాజంలో మార్గదర్శకాలుగా ఉపకరిస్తాయన్నారు. 1982లో విద్యార్ధి ఉద్యమ నాయకుడిగా ఉన్నతాను టిఆర్‌ఎస్ ఆవిర్భావం పిదప తెలంగాణ ఉద్యమనాయకుడిగా కళాశాలలో అడుగుపెట్టానని గుర్తుచేసుకున్నారు. కళాశాల ఔన్నత్యాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం వైపు నుండి సహకారం అందిస్తామన్నారు. జిల్లా పర్యావరణ పరిరక్షణకు, కరవు నిర్మూలనకు చేపట్టిన హరిత హారంలో అంతా భాగస్వామ్యం కావాలన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతు కళాశాలలో విద్యార్ధులు ఉత్తమ క్రమశిక్షణతో మెలిగి చదువులు కొనసాగించడం ద్వారా ఉత్తమ పౌరుడిగా సమాజంలో ఎదిగే ప్రయత్నం చేయాలన్నారు. కళాశాల అభివృద్ధికి ఎంపి కోటా నిధుల సహాయం కొనసాగిస్తానన్నారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తాను ఈ కళాశాలలో పిడిఎస్‌యు విద్యార్ధి నాయకుడిగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకుని కళాశాల గొప్పతనాన్ని వివరిస్తు కళాశాల అభివృద్ధికి తాను పాటుపడుతానన్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతు టిఆర్‌ఎస్ ఆవిర్భావంలో తాను ఎన్‌జి కళాశాల విద్యార్ధిగా ఉన్నానని తెలంగాణ సాధన ఉద్యమ అక్షరాభ్యాసం తనకు ఇక్కడే జరిగిందన్నారు. పూర్వ విద్యార్ధిగా కళాశాల అభివృద్ధికి తోడ్పడుతానన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతు ఎన్‌జి కళాశాల ఉన్నత చదువులకు, ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్ధే విజ్ఞాన కేంద్రంగా, ప్రగతిశీల భావాలకు వేదికగా కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్సీ పూల రవిందర్ మాట్లాడుతు నాగార్జున కళాశాలలో తాను సైతం పూర్వ విద్యార్ధినని కళశాల విజ్ఞానంతో పాటు చైతన్యాన్ని రగిలించి విద్యార్థుల్లో సామాజిక స్పృహా రగిలిస్తుందన్నారు. కళాశాల అభివృద్ధికి తనవంతు చేయూతనందిస్తానన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. నాగేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎన్‌జి కళాశాల వ్యవస్థాపకులు, పునాదిరాయి వేసిన టి.వెంకటనారాయణను ఘనంగా సన్మానించారు. వజ్రోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల ట్రస్టు ఆధ్వర్యంలో 200మంది ఉత్తమ విద్యార్థులకు బంగారుపత్రాలు, ప్రశంసపత్రాలు అందించారు.
ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ విసి అల్త్ఫా హుస్సెన్, అంబేద్కర్ యూనివర్సిటీ ఏడి ధర్మానాయక్, ఆర్‌జెడి ధర్జన్, మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మిశ్రీనివాస్, మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయగౌడ్, కొండకింది చినవెంకట్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చొల్లెటి ప్రభాకర్, అధ్యాపకులు బెల్లి యాదయ్య, దయాకర్, నిఖిత, మహిళా ప్రిన్సిపాల్ అలివేలు మంగ, లింగయ్య పాల్గొన్నారు.