నల్గొండ

గడువులోగా పుష్కర పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 22: పుష్కర ఘాట్‌లు, రోడ్ల పనులు ఈ నెల 28వ తేదిలోగా పూర్తి చేయాలని కృష్ణా పుష్కరాల పర్యవేక్షణా ప్రత్యేకాధికారి, ఇరిగేషన్ కార్యదర్శి ఐఏఎస్ వికాస్‌రాజ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ పుష్కరాల పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. పుష్కర ఘాట్‌ల ఇన్‌చార్జి అధికారులు, పోలీస్ అధికారులు సంయుక్తంగా సమావేశాలను ఏర్పాటు చేసుకుని ఘాట్‌లను సందర్శించి చేపట్టాల్సిన కార్యక్రమాలను సమీక్షించాలని, పుష్కరాలకు సంబంధించిన సిబ్బందిని, కావాల్సిన వసతులను ముందస్తుగా సిద్ధం చేసుకుని సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ప్రతి దేవాలయం ముందు రేయిన్ ప్రూఫ్ షెడ్‌లను ఏర్పాటు చేసి, అందులో ఉత్సవ మూర్తులను కొలువుతీరి భక్తుల దర్శన వసతి కల్పించి స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, తహశీల్ధార్లు సదరు ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు. పుష్కర ఘాట్‌లకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, ఆర్టీవో శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పుష్కర ఘాట్‌ల పరిధిలోని దేవాలయాల వద్ధ కొబ్బరి కాయలు అమ్మే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలన్నారు. రాకపోకలకు సమస్య లేకుండా రోడ్డుకు ఒకవైపు మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేయించాలన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ మాట్లాడుతు జిల్లాలో 483కోట్లతో పుష్కర ఘాట్‌ల పనులు చేపట్టామన్నారు. ముఖ్యంగా ఆర్‌ఆండ్‌బి, పంచాయతీరాజ్, దేవాదాయశాఖ, ఆర్‌డబ్ల్యుఎస్ పరిధిలో పనులు కొనసాగుతున్నాయన్నారు. ఘాట్‌ల నిర్మాణం పూర్తికావచ్చిందని, రోడ్ల నిర్మాణ పనులు, పార్కింగ్, హోల్టింగ్ పాయింట్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో గత కృష్ణా పుష్కరాల్లో ఐదు మండలాల్లో 11ఘాట్‌లు ఏర్పాటు చేయగా ఈ దఫా తొమ్మిది మండలాల్లో 28పుష్కర ఘాట్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత పుష్కరాల్లో 552మీటర్ల ఘాట్‌లు నిర్మించగా ఈ దఫా 2562మీటర్ల ఘాట్‌ల నిర్మాణం జరుగుతుందన్నారు. పుష్కర ఘాట్‌లు చందంపేట మండలంలోని కాచరాజుపల్లిలో 80మీటర్లు, పెద్దమునుగల్‌లో 120మీటర్లు, పిఏపల్లి మండలంలో అజ్మాపురం ఘాట్ 100మీటర్లు, పెద్దవూరా మండలంలోని ఉట్లపల్లిలో 90మీటర్లు, పొట్టిచెల్మలో 120మీటర్లు, సాగర్ అంజనేయ స్వామి 60మీటర్లు, శివాలయం ఘాట్ 50మీటర్లు, దామరచర్ల మండలంలో అడవిదేవుపల్లి ఘాట్ 126మీటర్లు, ముదిమాణిక్యం ఘాట్ 60మీటర్లు, ఇర్కిగూడెం ఘాట్ 50మీటర్లు, వాడపల్లి అయ్యప్పస్వామి ఘాట్ 100మీటర్లు, పాత సిమెంట్ ఘాట్ 50మీటర్లు, ముదిరాజ్ ఘాట్ 50మీటర్లు, పాత పోలీస్ స్టేషన్ ఘాట్ 50మీటర్లు, మెట్ల రేవు ఘాట్ 70మీటర్లు, లక్ష్మిపురంరేవు ఘాట్ 50మీటర్లు, శివాలయం ఘాట్ 290మీటర్లు, నరసింహస్వామి దేవాలయ ఘాట్ 100మీటర్లు, నేరడుచర్ల మండలం మహంకాళిగూడెం ఘాట్ 90మీటర్లు, మఠంపల్లి మండలంలోని బాలాజి ఘాట్ 80మీటర్లు, మార్కెండేయ ఘాట్ 200మీటర్లు, ప్రహ్లాద ఘాట్ 85మీటర్లు, మేళ్లచెర్వు మండలంలోని బుగ్గమాధారం ఘాట్ 120మీటర్లు, వజినేపల్లి ఘాట్ 100మీటర్లు, కిష్టాపూర్ ఘాట్ 100మీటర్లు, కనగల్ మండలం ధర్వేశిపురం ఘాట్ 50మీటర్లు, కనగల్ వాగు ఘాట్ 50మీటర్లు, నల్లగొండ పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం ఘాట్ 50మీటర్లు ఘాట్‌ల నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. ప్రతి ఘాట్‌లకు ఘాట్‌ల ఇన్‌చార్జిలను, సూపర్ వైజర్లను నియమించి పనులను పర్యవేక్షిస్తున్నామన్నారు. పుష్కరాలకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. వివిధ రకాల సేవలందించే ప్రభుత్వ సిబ్బందికి, స్వచ్చంద సంస్థల సిబ్బందికి సేవల వారిగా రంగుల డ్రెస్‌లు అందిస్తామన్నారు. శాఖల వారిగా పుష్కర పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేకాధికారికి ఇన్‌చార్జి కలెక్టర్ వివరించారు.
జిల్లా ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతు పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందిలేకుండా బందోబస్తు ఏర్పాటు చేపట్టామన్నారు. ప్రతి ఘాట్‌పై ముందుస్తు ప్రణాళికతో బందోబస్తు చేస్తున్నామన్నారు. పుష్కర విధులను నిర్వహించే అధికారులకు, అత్యవసర సేవలు అందించే వారికి పాస్‌లు అందిస్తామని కావాల్సిన వారు సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆడిషనల్ ఎస్పీ గంగారాం, ఏజెసి వెంకట్రావు, డిఆర్‌వో రవినాయక్, పుష్కర ఘాట్‌ల ప్రత్యేకాధికారులు, ఘాట్‌ల ఇన్‌చార్జిలు, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.