నల్గొండ

మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతనకల్, జూలై 22: మండలంలోని పోలుమల్ల గ్రామానికి చెందిన రాగిరి లావణ్య(22) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఇంట్లో లావణ్య ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో చొరబడి ఆమెపై దాడి చేసి గొంతుకు చున్నీ బిగించి, చేతి మణికట్టుపై గాయపరిచి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లాడు. సంఘటన జరిగిన కొద్ధిసేపటికే ఇంటికి చేరుకున్న మృతురాలి భర్త లింగయ్య రక్తపు మడుగులో పడివున్న తన భార్య లావణ్యను చూసి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు చేరుకుని విషయాన్ని పోలీసులకు తెలిపారు. క్లూస్ టీంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట డిఎస్పీ సునితామోహన్, స్థానిక ఎస్‌ఐ అభిలాష్‌లు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.