నల్గొండ

కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 4: ప్రజాకర్షణ హామీలతో మాటల గారడితో తెలంగాణ సెంటిమెంట్ బాసటతో ఎన్నికల్లో గెలిచి గద్దె నెక్కిన సీఎం కెసిఆర్ ప్రభుత్వం పాలనా వైఫల్యాలపై బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నుండి ఉద్యమాలు ఉదృతం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రకటించారు. గురువారం నల్లగొండ పోలీస్ ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా బిజెపి ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతు సీఎం కెసిఆర్ పాలనను దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా రైతాంగాన్ని, నిరుద్యోగుల సంక్షేమం నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలకు రాష్ట్రానికి 30వేల కోట్ల నిధులు ఇవ్వగా సదరు నిధులను దారిమళ్లించి క్షేత్ర స్థాయిలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు కాంట్రాక్టర్లుగా మారి దిగమింగుతున్నారన్నారు. రైతుల సంక్షేమానికి రామగుండంలో 60వేల కోట్ల నిధులతో ఎరువుల ఫ్యాక్టరీని కేంద్రం పునరుద్ధరిస్తుందన్నారు. కొత్తపల్లి రైల్వేలైన్, ఎన్‌టిపిసి విద్యుత్ ఫ్లాంట్, హెల్త్‌యూనివర్సిటీ, టెక్స్‌టైల్ పార్క్, మిషన్ భగీరథకు కేంద్రమే శ్రీకారం చుట్టిందన్నారు. పార్టీ ఫిరాయింపులపై టిఆర్‌ఎస్‌కు ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేకపోవడంతో ఎంసెట్-2లీకేజీ వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఎంసెట్-2లీకేజీతో విద్యార్థుల భవిష్యత్ గందరగోళంగా మారినా బాధ్యులైన మంత్రులపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్టుల కోసం ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను సంతలో పశువుల మాదిరిగా టిఆర్‌ఎస్ కొనుగోలు చేస్తుండగా ఆ పార్టీ కారులో మంది ఎక్కువై బోరుకు, రీపేర్‌కు వచ్చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులే నేడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న తీరు సీఎం కెసిఆర్ మోసపూరిత పాలనకు నిదర్శనమన్నారు. 123జీవో రద్ధుతో పాటు పలు జీవోల జారీపై కోర్టు కెసిఆర్ ప్రభుత్వానికి చెంప పెట్టు తీర్పులిచ్చిన తన ఒంటేద్దు పోకడలు మానడం లేదన్నారు. అధికారంలో లేనప్పుడు తెలంగాణ విమోచన దినత్సోవంతో హడావుడి చేసినా టిఆర్‌ఎస్ నేడు అధికారంలోకి వచ్చాకా మజ్లీస్‌కు లొంగిపోయి సెప్టెంబర్ 17విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం కారుకు మజ్లీస్ పార్టీ స్టీరింగ్‌గా మారిందన్నారు. టిఆర్‌ఎస్ పాలన తీరు చూసి నిజాంకు గోరికట్టిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మలు క్షోభిస్తున్నాయన్నారు. మజ్లీస్, టిఆర్‌ఎస్‌లను ఎదుర్కోనే సత్తా నేడు రాష్ట్ర రాజకీయాల్లో బిజెపికి మాత్రమే ఉందన్నారు. బిజెపి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను జరిపితీరుతామన్నారు. హర్యానా, అస్సాంలలో మాదిరిగా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారం సాధిస్తుందన్నారు. పల్లెపల్లెకు బిజెపి, ఇంటింటికి మోదీ పథకాల నినాదంతో బిజెపి బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.
బిజెపి నూతన జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు పేరాల చంద్రశేఖర్, చింతా సాంబమూర్తి, కాసం వెంకటేశ్వర్లు, జి.మనోహర్‌రెడ్డి, ప్రేమ్‌రాజ్‌యాదవ్, రామోజీ షణ్ముఖ, పాదూరి కరుణ, భాగ్యారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధసూధన్‌రెడ్డి, పి.సాంబయ్య, కె.శ్రీ్ధర్‌రెడ్డి, కె.శ్రీనివాస్‌రెడ్డి, బండారు ప్రసాద్, బాకి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.