నల్గొండ

మార్కెట్‌లను హరితంగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్‌లల్లో భారీ సంఖ్యలో మొక్కలు నాటి హరిత మార్కెట్‌లుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. గురువారం పట్టణంలోని నూతన వ్యవసాయ మార్కెట్‌యార్డును సందర్శించి మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ చుట్టు పెద్దసంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడిఎం ఎండి. అలీమ్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఇ.వెంకటేశం, మార్కెట్ సూపర్‌వైజర్లు , యుడిసి తదితరులు పాల్గొన్నారు.
మెగా ప్లాంటేషన్‌ను విజయవంతం చేయాలి
హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలో నిర్వహించే మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని 6వవార్డులోని శ్రీచైతన్య పాఠశాలతో పాటు వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో పట్టణంలో 4లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకొని ఇప్పటి వరకు రెండున్నర లక్షల మొక్కలను విజయవంతంగా నాటినట్లు చెప్పారు. మెగా ప్లాంటేషన్ కార్యక్రమం ద్వారా ఒకేరోజు 1,37వేల మొక్కలను నాటి లక్ష్యాన్ని అధిగమిస్తామన్నారు. హరితహారంలో అన్నివరాలు భాగస్వామ్యులవుతూ విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సూచన మేరకు హరితహారంలో సూర్యాపేట మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిపేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్‌పర్సన్ నేరేళ్ల లక్ష్మి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఆకుల లవకుశ, కౌన్సిలర్లు కల్లేపల్లి మహేశ్వరి, కుంభం రజిత, నాయకులు గండూరి ప్రకాశ్, నేరేళ్ల మధు, కల్లేపల్లి దశరథ, నంద్యాల భిక్షారెడ్డి, వున్నం సత్యనారాయణ, జహీంగీర్, శానిటరి ఇన్స్‌స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, సుర్గి శంకర్, హన్మంత్, సల్మాన్, గౌసువుద్దిన్, ఎస్‌ఎస్‌ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.