నల్గొండ

హరితహారం లక్ష్యాలు అధిగమించాలి : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, ఆగస్టు 4 : తెలంగాణ హరితహారం లక్ష్యాలను అధికారులు అధిగమించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సి ఎం కార్యాలయానికి హరితహారం వివరాలు రోజువారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు. డివిజన్ అధికారులు గ్రామస్ధాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రతి గ్రామ పంచాయితీకి 40వేల మొక్కలు నాటాలని సూచించారు. మొత్తం 406 నర్సరీల్లో 1.77 కోట్లు మొక్కలు సిద్దంగా ఉన్నాయన్నారు. రవాణా చేయడానికి 47 లక్షలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. ఎస్ ఎల్ బిసి కెనాల్ వెంట ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటాలన్నారు. ఈనెల చివరివారంలోగా హరితహారం లక్ష్యాలు సాధించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డి ఒ వెంకటాచారి, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి, డి ఎఫ్ ఒలు మాధవరావు, సుదర్శన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.