నల్గొండ

భ్రూణ హత్యలకు పాల్పడ్డ వారిపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 4: భ్రూణహత్యలకు పాల్పడ్డ ఎలాంటి వారైనప్పటికి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ భానుప్రసాద్‌నాయక్ తెలిపారు.
గురువారం భ్రూణహత్యలకు గురైన మూడు పిండాలను గుర్తు తెలియని వ్యక్తులు పారవేసిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం స్థానిక వైద్యారోగ్యశాఖ క్లస్టర్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ 5 నుండి 7 నెలల శిశు పిండాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎన్‌ఎస్‌పి అతిధి గృహం ముందు క్యారీబ్యాగులో పడేశారని ఆయన అన్నారు. బయోవేస్టును తీసుకుని వెళ్లే వాహనం నుండి పడిందా అనే విషయాన్ని పరిశీలించగా ఆ వాహనం బుధవారం నాడే సాయంత్రం నాలుగున్నర గంటలకు మిర్యాలగూడ వచ్చి వైద్యా వ్యర్థాలను సేకరించి తీసుకుని పోయిందని ఆయన అన్నారు.
మిర్యాలగూడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు 42 ప్రైవేట్ ఆసుపత్రులతో బయో వేస్టు వాహనం టై అప్ ఉందని ఆయన అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో అనుమానం ఉన్న శే్వత నర్సింగ్‌హోం, ఉజ్వల నర్సింగ్‌హోం, శ్రీదేవి నర్సింగ్‌హోంల నిర్వాహకులు, వైద్యులను విచారించినట్టు ఆయన తెలిపారు. అదే విధంగా తమ ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు గ్రామాల్లో, పట్టణాల్లో ఎప్పటికప్పుడు మూడు నెలలు నిండిన గర్భిణిల పేర్లను నమోదు చేస్తున్నారని, ఆ కోణంలో తాము విచారణ చేస్తామని ఆయన అన్నారు. గర్భిణిలపై నిఘా ఉంచుతున్నామని మొత్తం మీద ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్య ఉంటుందని, ఆసుపత్రి అనుమతి, డాక్టర్‌పై పిసిఎన్‌డిటి చట్టం ప్రకారం చర్య ఉంటుందని ఆయన అన్నారు. గర్భస్రావం చేయించుకున్న వారిపై కూడ చర్య ఉంటుందని ఆయన అన్నారు. ఆయన వెంట డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ కృష్ణకుమారి, డాక్టర్లు సాహితి, సాంబశివరావు,సిహెచ్‌ఓ శ్రీనివాసస్వామి, డిపిఎం భగవాన్‌నాయక్‌లున్నారు.