నల్గొండ

పుష్కర స్నానం.. ఆనందదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఆగస్టు 23: పుష్కర స్నానం చేయడం వలన సాంప్రదాయాలను, ఆచారాలను నిలబెట్టుకోవడంతో పాటు మనుసుకు ఆనందం, ప్రశాంతం కలుగుతుందని సిఎల్‌పి నేత, సాగర్ శాసనసభ్యులు కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం సతీసమేతంగా శివాలయఘాట్‌లో స్నానమాచరించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ప్రశాంతమైన వాతావరణంలో పుష్కరాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు అబ్బిడి కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డిలు ఉన్నారు.