నల్గొండ

రెడ్లరేపాక అభివృద్ధి పనులపై ఎంపి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మార్చి 26: ఆదర్శగ్రామం రెడ్లరేపాక గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఎంపి బూర నర్సయ్యగౌడ్ స్థానిక గ్రామ కార్యాలయంలో సంసద్ గ్రామయోజన కింద దత్తత తీసుకున్న గ్రామం ఎడ్లరేపాకలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత జిల్లా అధికారులతో శనివారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ అధికారులు రెడ్లరేపాక గ్రామంలో మిషన్ కాకతీయ కింద మంజూరైన చెరువులలో త్వరితగతిన పనులు చేపట్టాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందిలేకుండా చూడాలని, వాటర్ గ్రిడ్ పథకం కింద పనులు ఆవాసా గ్రామాల్లో కూడా నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని, గ్రామంలో ఇంటింటికి మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం జరిగేలా ప్రోత్సహించాలని ఎంపి అన్నారు. హార్టికల్చర్ అధికారులు రెడ్లరేపాకకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తూ డ్రిప్స్‌ను మంజూరుచేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమంలో భోదించేందుకు ప్రభుత్వం ఆమోదం పొందేలా జిల్లా విద్యాశాఖాధికారి ప్రయత్నించాలని, హరితహారం కింద 101కల్లుగీత సొసెటీలలో తాటి, ఈత వనాలను పెంచాలని ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ ప్రతిపాదించిన పనులన్ని మే నెలాఖరు వరకు పూర్తిచేయాలని అధికారులను కోరారు. ఈసమావేశంలో రెడ్లరేపాక చార్జ్ ఆఫీసర్ దామోదర్‌రెడ్డి, ఎస్‌ఇ తియార్, ఎస్‌ఇ ఆర్‌డబ్ల్యుఎస్, జెడి వ్యవసాయం, సిసిఓ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పాలనపై పట్టులేని ప్రభుత్వం
* ఎడమకాల్వకు తక్షణమే నీటిని విడుదలచేయాలి
* కోమటిరెడ్డి బ్రదర్స్‌తో ఎలాంటి విభేదాలు లేవు
* నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి
సూర్యాపేట, మార్చి 26: తీవ్ర కరవుపరిస్థితుల్లో తాగునీటి కోసం అల్లాడుతున్న జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం తక్షణమే నాగార్జున్‌సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదలచేయాలని నల్లగొండ పార్లమెంట్‌సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. శనివారం పట్టణంలోని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. వరుస కరవు పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటి గ్రామాల్లో ప్రజలు గుక్కెడునీటి కోసం అల్లాడుతుండగా తక్షణమే సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాల్సి ఉండగా జిల్లామంత్రి తాగునీటి సమస్యపై సమీక్షాచేసి ఏప్రిల్ మొదటివారంలో నీటిని విడుదలచేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అప్పటి వరకు ప్రజలు మంచినీటికోసం అలమటించాల్సిందేనా అని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ నేతలు సాగర్ నుండి ఎడమకాల్వకు ఎందుకు నీటిని విడుదల చేయించలేక పోయారో ప్రజలకు సమాధానమివ్వాలని కోరారు. కరవు పరిస్థితుల దృష్ట్యా తాగునీటి ఎద్దడి నివారణకు నిధులు మంజూరు చేయాలని తాను ప్రభుత్వానికి ముందుగానే లేఖ రాయడంతో ప్రభుత్వం రూ.20కోట్ల నిధులను మంజూరు చేసిందని, మరోవిడత రూ.5.80కోట్ల నిధులను విడుదలచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో అవగాహన రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని, పాలనపై పట్టులేక పోవడంతో ప్రజలు సమస్యలతో ఇబ్బందుల పాలవుతున్నారని, అనేక ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి వివిధ రూపాల్లో తాము తీసుకువస్తున్నా ప్రభుత్వం తమను అభివృద్ధి వ్యతిరేకులమని దుష్పచారం చేస్తోందని మండిపడ్డారు. రెండవపంటల సాగుకోసం తమ ప్రభుత్వం నీరిచ్చిందని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, గత 50ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే గతంలో అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు రెండవపంట సాగుకు నీటిని ఇచ్చాయన్నారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై తాము ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నామని అసత్య ప్రచారం చేస్తు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, ముఖ్యమంత్రి కెసిఆర్ మాటల గారడీచేస్తు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ప్రకటనలు కోటలు దాటుతున్న పనులు మాత్రం గడప దాటని పరిస్థితి నెలకొని ఉందన్నారు. రాష్ట్రానికి అపార ఆదాయం వస్తోందని చెబుతున్న ప్రభుత్వం 26వ తేదీ వచ్చిన ఇప్పటికీ ఆసరా పెన్షన్‌లను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటున్నారని, త్వరలోనే ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ ఎమ్మెల్యేల అందరితో , సమన్వయంతో 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. విలేఖరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ, డిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు, కాంగ్రెస్ నాయకులు బైరు వెంకన్నగౌడ్, అంగిరేకుల నాగార్జున, అబ్థుల్ రహీం, బంటు చొక్కయ్య, వీరన్న నాయక్, డిసిసిబి డైరెక్టర్ ముదిరెడ్డి రమణారెడ్డి, యూత్‌కాంగ్రెస్ నల్లగొండ పార్లమెంట్ అధ్యక్షుడు కుమ్మరికుంట్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన ఎరువులతో రైతుకు తోడ్పాటు
* డిసిసిబి చైర్మన్ పాండురంగారావు డిమాండ్
మిర్యాలగూడ, మార్చి 26: ఎరువుల కంపెనీలు రైతులకు తక్కువ ధరకు నాణ్యమైన ఎరువులను అందించి రైతులు ఆర్ధికంగా అభివృద్ది చెందేందుకు తోడ్పాటు నందించాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ముప్పవరపు పాండురంగారావు అన్నారు. శనివారం పట్టణంలోని ఐఎంఎ భవనంలో ఇఫ్కో ఎరువుల కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయ సహకార సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, అందువల్ల రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు కృషిచేయాలని ఆయన అన్నారు. ఎరువుల వాడకంపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఆదర్శవంతమైన సంస్థగా ఇఫ్కో ఎరువుల కంపెనీ రైతుల మన్ననలను పొందిందని ఆయన అన్నారు. దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, దాంతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, అందువల్ల రైతుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషిచేయాలని ఆయన కోరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ప్రగతిపథంలో నడిపించే బాధ్యత సిఇఓలది, చైర్మన్‌లది అని ఆయన అన్నారు. ప్రభుత్వాలు సహకారసంఘాలకు తోడ్పాటునందిస్తే సంఘాలు నెంబర్ 1గా నిలుస్తాయని, సంఘాలను అభివృద్ధి పథంలోకి తీసుకపోవడమేకాకుండా రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాలు కృషిచేయాలని ఆయన అన్నారు. ఉగాది నాటికి సిఇఓలకు హెల్త్‌కార్డులు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. డిసిఎంఎస్ చైర్మన్ జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎరువుల విక్రయం ద్వారా సంఘాలను బలోపేతం చేసుకోవాలని ఆయన అన్నారు. ఇఫ్కో ఎరువుల కంపెనీ రీజనల్ మేనేజర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇఫ్కో ఎరువుల కంపెనీ రూ.400కోట్ల వాటాధనంతో ఎరువులను ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అభివృద్ధిచెందిందని ఆయన అన్నారు. దేశంలోని రైతులకు 35శాతం రైతులను ఇఫ్కో కంపెనీ ఉత్పత్తి చేసి అందిస్తుందని ఆయన అన్నారు. నాణ్యమైన ఎరువులను తక్కువ ధరకు రైతులకు అందించడమే ఇఫ్కో సంస్థ లక్ష్యమని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఖమ్మం డిసిసిబి చైర్మన్ అంజయ్య, సీనియర్ మేనేజర్ నాగేశ్వర్‌రావు, డివిజన్ మేనేజర్ గంగాధరప్ప, ఎడిఎ శ్రీ్ధర్‌రెడ్డి, డిసిసిబి డైరెక్టర్లు డేగ బాబు, గరిణె కోటేశ్వర్‌రావు, ఏరియా మేనేజర్ మాంజి, ఎఓ జయప్రద, డీలర్ల సంఘం నాయకులు రామ్మూర్తి, సంస్థ ఉద్యోగులు మహేష్, సహకార సంఘాల సిఇఓలు, చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.