నల్గొండ

ఖైరతాబాద్ గణేషునికి 75 అడుగులు చేనేత కండువా తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 30 : మండలంలోని కనుముక్కుల గ్రామం హ్యాండ్‌లూమ్ పార్కులో చేనేత కళాకారులు ఖైరతాబాద్ గణేషునికి 75 అడుగుల చేనేత కండువాను తయారు చేస్తున్నారు. ఈ కండువాపై శివలింగం, త్రిశూలం, లడ్డూలు, తామరపుష్పం, ఓంకారం డిజైన్లను అందంగా రూపొందించారు. చేనేత కళాకారులు గత వారం రోజుల నుంచి ఈ వస్త్రం తయారీలో నిమగ్నమయ్యారు. చేనేతకు పూర్వవైభవం తీసుకురావడం కోసం కండువా తయారు చేస్తున్నామని కళాకారులు పేర్కొన్నారు. చేనేత కళాకారుల నైపుణ్యాన్ని పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో హ్యాండ్‌లూమ్ పార్కు చైర్మన్ దేవేందర్, ప్రతినిధులు కృష్ణ, ఉపేందర్, అమరేందర్, మధు, వెంకటేశం, మోహన్ పాల్గొన్నారు.