నల్గొండ

హుజూర్‌నగర్‌లో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, ఆగస్టు 30: మంగళవారం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు హుజూర్‌నగర్ పట్టణంలోని, మండలంలోని చెర్వులు నిండి పోయి రోడ్లపై, కల్వర్టులపై అలుగులు ప్రవహించటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. పట్టణంలో పేదలకు చెందిన 11 పూరి ఇండ్లు వర్షానికి కూలిపోయాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ భారీ వర్షానికి ఒక్కసారిగా కూలిపోవటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉలిక్కిపడ్డారు. యన్‌యస్‌పి క్యాంప్ లోని ప్రాధమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల చట్టు నీరి చేరి చెర్వులాగా మారింది. 16, 17, 18 వార్డులలో వర్షానికి 4 ఇండ్లు కూలిపోవటంతో వారిని స్థానిక టౌన్ హల్‌కు తరలించి తహశీలుదారు, కౌన్సిలర్లు, గ్రంధాలయ కమిటీ చైర్మన్‌లు భోజనం ఏర్పాటు చేసి అందించారు.
నిండిన ఊరచెర్వు
గత 10 సంవత్సరాలుగా నిండని ఊరచెర్వు మంగళవారం కురిసిన కుంభ వర్షానికి 2 గంటలో నిండి అలుగు పారటంతో గోవిందాపురానికి, హుజూర్‌నగర్‌కు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఊరచెర్వు అలుగు గోవిందాపురం కల్వర్టు పైనుండి భారీగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మట్టపల్లి రహదారిలోని కల్వర్టుల పైనుండి వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో మఠంపల్లి, మట్టపల్లికి రాకపోకలు నిలిపిపోయాయి. గోవిందాపురం వద్ద కల్వర్టు పైగల అలుగు వల్ల మేళ్లచెర్వు, సింగారం రాకపోకలు నిలిచిపోయాయి.
180.8 మిల్లీమీటర్ల వర్షం
--తహశీలుదార్ రవి
హుజూర్‌నగర్ పట్టణంలో, మండలంలో మంగళవారం 180. 8 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని 11 ఇండ్లు కూలిపోగా పేదలకు సహాయ చర్యలు చేపట్టామని స్థానిక టౌన్‌హల్‌లో భోజన వసతి, తాత్కాలిక నివాస వసతి ఏర్పాటు చేశామని తహశీలుదారు టి రవి చెప్పారు.
జలమయమైన కాలనీలు
మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు హుజూర్‌నగర్‌లో కురిసిన భారీ వర్షానికి హరిజన వాడ, క్రిష్టియన్ పేట, అంబేద్కర్ కాలనీ, చింతలబజార్, దద్దనాల చెర్వు కాలనీ, గోవిందాపురం కాలనీలు జలమయమైనాయి. భారీ వర్షాలకు కాలనీ వాసులు ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా 6 గంటల పాటు వర్షం కురిసింది. మండలంలోని బూరుగడ్డ, లింగగిరి చెర్వులు నిండిపోయి అలుగులు పారుతున్నాయి.