నల్గొండ

దొంగనోట్ల ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, సెప్టెంబర్ 1: గుట్టుచప్పుడు కాకుండా దొంగనోట్లు చలామణి చేస్తూ జల్సాలు చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని వాడపల్లి పోలీసులు పట్టుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మిర్యాలగూడ డిఎస్పీ రాంగోపాల్‌రావు వివరాలను వెల్లడించారు. మండలంలోని తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన బెల్లంకొండ కాశమ్మ కిరాణం షాపులో బుధవారం రాత్రి 8గంటల సమయంలో బత్తుల శ్రీరాములు, అమరయ్య, దొడ్డ మార్కొండారెడ్డి ముగ్గురు అపాచి వాహనంపై వచ్చి 500రూపాయల నోటును కాశమ్మకు ఇచ్చి గోల్డ్ఫ్లాక్ సిగిరేట్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశారని ఆమె సిగిరెట్ ప్యాకెట్ విలువపోను మిగిలిన చిల్లరను వారికి అందచేసింది. ఇంతలోనే కాశమ్మ కుమారుడు కిరాణషాపు వద్దకు చేరుకోగా వారు ఇచ్చిన రూ.500నోటును పరిశీలించగా అది దొంగనోటు అని తేలడంతో వారిని వెంబడించి దామరచర్లలోని ప్రసాద్ కిరాణం షాపు వద్ద అడ్డగించగా మార్కొండారెడ్డి పారిపోగా అమరయ్య, శ్రీరాములు దొరకడంతో ఇరువురిని ప్రసాద్, సైదులు ఇద్దరు కలిసి వాడపల్లి స్టేషన్‌లో అప్పగించి బెల్లంకొండ సైదులు వారిపై ఫిర్యాదుచేశాడు. దీంతో అప్రమత్తమైన ఎస్‌ఐ చరమందరాజు వారిని విచారించగా గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన సుదినబోయిన అమరయ్య, దొడ్డ మార్కొండారెడ్డి, తాటిపర్తి పాపిరెడ్డి, చెన్నుపల్లి యశోదలు కాగా అదే మండలం గంగులకుంటకు చెందిన బత్తుల శ్రీరాములు ఐదుగురు కలిసి జల్సాలకు అలవాటు పడి ఖర్చుల నిమిత్తం డబ్బులు లేకపోవడంతో అమరయ్య విజయవాడకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తి పరిచయం కావడంతో రెండు నెలల క్రితం కలర్ ప్రింటర్, పేపర్ కటింగ్ మిషన్ కొనుగోలు చేసి గ్రామానికి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని పాపిరెడ్డికి తెలుపగా పాపిరెడ్డి గ్రామంలో ఎవరికైనా అనుమానం వస్తుందని చెప్పి ఆయనకు పరిచయం ఉన్న నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పర్వేదుల గ్రామంలో నివాసం ఉంటున్న చెన్నుపల్లి యశోద ఇంట్లో ప్రింటర్ నడిపేందుకు ఆమెతో చర్చించి మిషన్‌ను అక్కడ ఏర్పాటుచేశారు. గత రెండు నెలలుగా 500రూపాయల నోట్లను తయారుచేసి అడవిదేవులపల్లి, మాచర్ల, నాగార్జునసాగర్, హాలియా, డొక్కలబావితండా, దామరచర్లలో మార్పిడి చేయుచున్నారు. ఆక్రమంలోనే తాళ్లవీరప్పగూడెంకు చెందిన కాశమ్మకు దొంగనోటు ఇవ్వగా గుట్టురట్టు అయిందని తెలిపారు. వారి వద్ద నుండి 500రూపాయల కట్టలు 37, చిల్లరగా మూడు 500రూపాయల నోట్లను, వారి జేబుల్లో ఉన్న నగదుతో కలిపి మొత్తం రూ.18,91,500సేకరించినట్లు తెలిపారు. ఇవి కాకుండా అపాచి ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లను స్వాదీనపరుచుకున్నట్లు ఆయన చెప్పారు. ఆయన వెంట మిర్యాలగూడ రూరల్ సిఐ రవీందర్, వాడపల్లి ఎస్‌ఐ చరమందరాజు ఉన్నారు.