నల్గొండ

ఖాళీ అవుతున్న ముంపు గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, సెప్టెంబర్ 1: రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణనదికి భారీగా వరదనీరు చేరింది. వరదనీరు ఉదృతమై మండలపరిధిలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద 17టి ఎంసిల మేర నీటి నిల్వకు చేరింది. దీంతో ముంపు గ్రామాలైన నెమలిపురి, వెల్లటూరు. అడ్లూరుకు వరదనీరు చేరడంతో కృష్ణనది ప్రవాహం ద్వారా వరదనీరు చేరడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ముంపు గ్రామాల నుండి ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. గురువారం చింత్రియాల గ్రామానికి కృష్ణనది నీరు చుట్టుముట్టడంతో గ్రామ ప్రజలను ప్రత్యేక వాహనాల్లో పునరావాసకేంద్రాలకు తరలిస్తున్నారు. మరో ముంపు గ్రామమైన రేబల్లె గ్రామ ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సూర్యాపేట డి ఎస్పి సునీతామోహన్, ఆర్డీవో నారాయణరెడ్డి ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ పోలీస్ బలగాలను, రెవెన్యూ యంత్రాంగాన్ని గ్రామాల్లో మోహరించి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన లారీలు, ట్రాక్టర్లల్లో ప్రజలను, వారి సామానులను, పశుసందను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుండి కృష్ణనదికి 20వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా పులిచింతల వద్ద గేట్లు మూసి ఉంచి దిగువకు చుక్కనీరు కూడా వదలడం లేదు. దీంతో వరదనీరు భారీగా వస్తే పులిచింతల బ్యాక్ వాటర్‌తో మరికొన్ని గ్రామాలు జలమయం అయ్యే పరిస్థితి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పై అధికారుల సూచనలతో దశల వారీగా గ్రామాలను ఖాళీచేయిస్తున్నారు.