నల్గొండ

వరద ఉద్ధృతిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించిన స్థ్ధానికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 1 : పోచంపల్లి పెద్దచెరువు అలుగు ఉధృతిలో ఓ వ్యక్తి కొట్టుకుపోతూ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఇంద్రియాల గ్రామానికి చెందిన బంతి గోవర్ధన్ హైద్రాబాద్‌లో విధులు పని ముగించుకొని భైక్‌పై భార్యతో కలసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. తిరుగు ప్రయాణంలో పోచంపల్లి చెరువు అలుగును దాటుతుండగా వరద ఉద్ధృతికి భైక్‌పై నుంచి కింద పడిపోయాడు. భార్య చెరువువైపు పడగా గోవర్ధన్ మాత్రం భైక్‌తో సహా వరద ఉద్ధృతికి అలుగు కింద ఐదు అడుగుల లోతులో పడిపోయి కొంతదూరం కొట్టుకుపోయారు.స్థానికులు గమనించి అతనిని బయటకు లాగారు. ప్రమాదంలో గోవర్ధన్ తల, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.