నల్గొండ

తెలంగాణ శ్రీశైలంగా చెర్వుగట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, సెప్టెంబర్ 1 : తెలంగాణ శ్రీశైలంగా చెర్వుగట్టు రూపు దిద్దుకుంటుందని, అందుకోసం ప్రభుత్వం నుంచి కావల్సిన సహాయ సహకారాలు అందించడంలో ముఖ్య పాత్ర పోషించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ బాధ్యులు ఇంధ్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఆయన పాల్గొని పులకరించిపోయారు. కొండపైకి వెళ్లిన మంత్రి ఇంధ్రకరణ్‌రెడ్డికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఎదురేగి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి లక్ష పుష్పార్చన కార్యక్రమంలో దంపతులు పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చెర్వుగట్టు అద్భుత క్షేత్రంగా వెలుగొందుతుందని రాబోయే కాలంలో ఏర్పాటు అవుతున్న జిల్లాలో నల్లగొండకు చెర్వుగట్టు తలమానికంగా నిలవబోతుందన్నారు. ఈ క్షేత్రంలో ఉన్న పరమేశ్వరుడి ఆకృతి గుహలో వెలసిన స్వయంభు జడల రామలింగేశ్వరుడి దర్శనం భక్తులో కొత్త అనుభూతిని నింపుతుందన్నారు. బాధలతో కొండకు వచ్చే భక్తులకు స్వామి దర్శనం మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు నూతన శక్తిని ప్రసాదించే సుందరక్షేత్రమన్నారు. అందుకే కాబోలు అమవాస్య రోజు లక్షలాది మంది భక్తులు కొండపైకి వచ్చి ధనిక, పేద అనే తారతమ్యాలు లేకుండా నేలపైన సైతం నిద్రించి స్వామి కరుణకటాక్షం పొందుతున్నారని పేర్కొన్నారు. స్వామి మహిమానితం తెలుసుకొని తాను సైతం భక్తుడికి స్వామి సన్నిధిలో నిద్రించేందుకు అమవాస్య రోజు వచ్చినట్లు వివరించారు. మొదటిసారిగా వచ్చిన తనకు చెర్వుగట్టు పరిసర ప్రాంతాలు, కొండపైబాగం చక్కటి ఆనందాన్ని ప్రసాదించిందన్నారు. జాతీయ రహదారికి, అద్దంకి, విజయవాడ, జాతీయ రహదారుల మధ్య ఉండటంతో పాటు హైద్రాబాద్ రాజధానికి కేవలం 80 కిలోమీటర్ల దూరమే ఉండటం అభివృద్దికి నాంది అన్నారు. కొండపైన కావలసిన వసతులపై సమీక్షించి నిధులు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. మంత్రితో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్ రమణబాలకృష్ణలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ విజయలక్ష్మి, చెర్వుగట్టు ఆలయ కార్యనిర్వాహణ అధికారి మనోహర్‌రెడ్డి, ఎండిఒ సురేష్‌కుమార్, జిల్లా టి ఆర్ ఎస్ నాయకులు వెంకన్న, నర్సింహ్మారెడ్డి, సైదులు, రహీంఖాన్, పలువురు నేతలు పాల్గొన్నారు.