నల్గొండ

ఎస్సారెస్పీ, ఎఎమ్మార్పీకి నీటిని విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 1: నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేస్తున్నప్పటికి కాలువలో నీటి ప్రవాహం సరిపడ సాగకపోవడంతో ఆయకట్టు రైతులకు పెద్దగా మేలు జరుగడం లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు ప్రస్తుత కరవు పరిస్థితుల్లో సాగునీటి కంటే ముందుగా సాగర్ ఎడమకాలువ పరిధిలోని మంచినీటి చెరువులు, కుంటలకు, ఏఎమ్మార్పీ తాగునీటి చెరువులకు, ఎఎస్సారెస్పీ చెరువులకు నీటి విడుదల చేసి ప్రజల మంచినీటి అవసరాలు తీర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోచంపాడు నీటి నిల్వపై ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో 50టిఎంసిల నీరుందని చెప్పినందునా సదరు నీటిని కాలువలకు విడుదల చేసి ఖమ్మం, నిజామబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజల తాగునీటి కొరత తీర్చాలన్నారు. ప్రాజెక్టు పరిధిలోని కాలువలకు 5టిఎంసిల చొప్పున విడతల వారీగా మార్చి వరకు విడుదల చేయాలన్నారు. కరువు పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న రైతులకు కేంద్రం అందించిన ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలన్నారు. అలాగే రుణమాఫీ ఏకకాలంలో చేయాలన్నారు. తొమ్మిది గంటల విద్యుత్‌ను బోర్లలో నీటి లభ్యతను అనుసరించి షిఫ్ట్‌ల వారీగా ఇవ్వాలన్నారు. జిల్లాల విభజనను ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహిస్తుందని 2019ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల విభజన చేస్తుండటం దారుణమన్నారు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల విభజన చేయాలన్నారు. పలు నియోజకవర్గాలను రెండు మూడు జిల్లాల పరిధిలో విభజించడం సమంజసంగా లేదన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు గోలి మధుసూధన్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పి.శ్యాంసుందర్, నూకల వెంకటనారాయణరెడ్డి, పొతెపాక సాంబయ్య, బాకి పాపయ్య, రావుల శ్రీనివాస్‌రెడ్డి, బోగరి అనిల్, బొజ్జ నాగరాజు, శేఖర్, ముత్యాల్‌రావు,లక్ష్మణ్, పెరికే మునికుమార్ పాల్గొన్నారు.