నల్గొండ

జిల్లాపై వరుణుడి కరుణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 1: జిల్లాపై వరుణుడి కరుణ కొనసాగుతుండగా అల్పపీడన వర్షాల జోరు గురువారం కూడా కొనసాగింది. జిల్లా 42మండలాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు పడగా 12.7మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. తాజా వర్షాలకు భూదాన్ పోచంపల్లి, బీబీనగర్, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్, మిర్యాలగూడ, దామరచర్ల, మేళ్లచెర్వు, నేరడుచర్ల, హుజూర్‌నగర్, తిప్పర్తి, గరిడేపల్లి, మఠంపల్లి, నల్లగొండ మండలాల్లో చెరువులు, కుంటలకు వరద నీరు చేరగా పలు చెరువులు అలుగులు పోస్తున్నాయి. మూసీ నది పొంగి వరద నీరు కాజ్‌వేల మీదుగా ప్రవహించడంతో బీబీనగర్-పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోచంపల్లి పెద్ద చెరువు అలుగు వరద ఉదృతికి దిగువన ఉన్న రోడు మార్గంలో వెలుతున్న సుశీల, గోవర్ధన్‌లు ప్రయాణిస్తున్న బైక్ నీళ్లలో వరదలో కొట్టుకపోగా అక్కడే ఉన్న స్థానికులు వారిని రక్షించారు. తిప్పర్తిలో వాగులు పొంగి చెరువులు, కుంటలు అలుగు పోశాయి. రైల్వే ట్రాక్ అండర్ పాస్ మార్గంలో వరద నీరు సాగడంతో కనె్నకల్ గ్రామస్తులు రైల్వే ట్రాక్ పైనుండి రాకపోకలు సాగిస్తున్నారు.
ముంపు ప్రజల తరలింపు
పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు తాకిడి పెరుగడంతో 17టిఎంసిలకు నీటి మట్టం పెరిగింది. ముంపు గ్రామాలు వెల్లటూరు, అడ్లూరు, నెమలిపురి గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ముంపు గ్రామం చింత్రియాలను కూడా వరద నీరు చుట్టుముట్టడంతో అధికారులు గురువారం గ్రామస్తులను ఖాళీ చేయించి పునరావాస గ్రామాలకు తరలించారు.
42 మండలాల్లో వర్షాలు
జిల్లాలో గురువారం 42మండలాల్లో వర్షాలు పడగా 12.7మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. అధికంగా చండూర్ మండలంలో 70.8, దామరచర్లలో 46.6, నారాయణపూర్‌లో 46.2, నాంపల్లిలో 41.2, చౌటుప్పల్‌లో 40, త్రిపురారంలో 38.6, తుర్కపల్లిలో 34.4, రామన్నపేటలో 33, మర్రిగూడలో 32.4, నిడమనూర్‌లో 29.4, పోచంపల్లిలో 27, కనగల్‌లో 26.8, వేములపల్లిలో 26.2, చింతపల్లిలో 23.8, కట్టంగూర్‌లో 23.6, గుర్రంపోడులో 19.8,యాదగిరిగుట్టలో 18.4, త్పిర్తిలో 16.6, నల్లగొండలో 16.4, వలిగొండలో 12.6, నార్కట్‌పల్లిలో 12.6, డిండిలో 12.6, హాలియాలో 12.4, బీబీనగర్‌లో 11.2, పెద్దవూరాలో 8.6, చిట్యాలలో 7మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది.