నల్గొండ

వర్షాలతో మునిగిన ఇళ్లు, వీధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 22: వరుసగా కురుస్తున్న వర్షాలతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం పట్టణంలో భారీ వర్షం పడడంతో వీధులన్ని వరదనీటితో పోటెత్తాయి. మరోవైపు మూసీ నుండి నీటిని విడుదల చేస్తుండడంతో పట్టణంలోని సద్దలచెర్వు, పుల్లారెడ్డిచెర్వులు పొంగిపొర్లుతున్నాయి. పట్టణంలోని 10,11,12 వార్డుల్లో వరదనీరు వీధుల్లోకి చేరి మెకాలిలోతు ప్రవాహించడంతో ప్రజలు రాకపోకలు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 60్ఫట్స్‌రోడ్డు, గోపాళపురం, రాజారాం కళాశాల రోడ్డులో ఉన్న పలు గృహానికి వరదనీరు చేరింది. మరోవైపు పట్టణంలోని ప్రధాన నాలా ఉదృతంగా ప్రవహిస్తుండడంతో నాలా పరివాహక ప్రాంతాల్లో వరదనీరు ముంచెత్తుతుంది. పలుచోట్ల మురుగుకాల్వలు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలు కొనసాగించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. పట్టణంలోని ముంపు ప్రాంతాలను మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, కమీషనర్ వడ్డె సురేందర్‌లు పరిశీలించి సహాయక చర్యలను చేపట్టారు.