నల్గొండ

వర్ష బీభత్సం.. స్తంభించిన జనజీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, సెప్టెంబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్థంభించిపోయింది. ఉదయం ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో గృహాల నుండి ప్రజలు బయటకు రాలేకపోయారు. పట్టణంలోని కాలనీలో ఉన్న నాలాలు పొంగిపొర్లడంతో రోడ్లన్ని జలమయమై గృహాల్లోకి, షాపుల్లోకి భారీగా వర్షపునీరు వచ్చి చేరింది. వర్షపునీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని రెడ్డికాలనీ, అశోక్‌నగర్, ముత్తిరెడ్డికుంట, సీతారాంపురం, హనుమాన్‌పేట, బంగారుగడ్డ, షాబునగర్, సుందర్‌నగర్ తదితర కాలనీల్లోని నాలాలు పొంగిపొర్లడంతో వర్షపునీరు రోడ్డుపై ప్రవహించి గృహాల్లోకి వచ్చి చేరింది. గృహాల్లో ఉన్న సామాగ్రి తడిసి ముద్దయింది. పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ సమీపంలో నల్లగొండ రోడ్డుపై ఉన్న నాలా పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఆర్టీసి బస్‌స్టాండ్ సమీపంలో సాగర్‌రోడ్డుపై వర్షపునీరు భారీగా నిలవడంతో ద్విచక్ర వాహనదారులు, ప్రజలు రాకపోకలకు కొంత ఇబ్బందిపడ్డారు. మిర్యాలగూడ డివిజన్ పరిదిలోని ఆయా మండలాల్లో ఉన్న చెరువులు, కుంటలు వర్షానికి నిండి అలుగులు పోస్తున్నాయి. చెరువులన్ని కూడా నీటితో జలకళలాడుతున్నాయి. కాగా పట్టణంలోని హనుమాన్‌పేట, అశోక్‌నగర్‌లలో వర్షపునీరు గృహాల్లోకి వచ్చి చేరగా వాటిని తహశీల్దార్ కృష్ణారెడ్డి పరిశీలించారు. విటి థియేటర్ వద్ద పొంగిపొర్లుతున్న నాలాలను తహశీల్దార్ పరిశీలించారు. మిర్యాలగూడ మండలంలోని ఎస్‌సి కాలనీలోని పది గృహాల్లోకి వర్షపునీరు వచ్చి చేరగా తహశీల్దార్ మాలి కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మిర్యాలగూడ డివిజన్‌లోని మిర్యాలగూడలో 90మి.మీ, నేరేడుచర్లలో 29.2మి.మీ, దామరచర్లలో 170మి.మీ, హాలియాలో 51మి.మీ, వేములపల్లిలో 132.6మి.మీ, నిడమనూరులో 51.2మి.మీ, పెద్దవూరలో 25మి.మీ, త్రిపురారంలో 60మి.మీ, గరిడేపల్లిలో 50మి.మీ, మఠంపల్లిలో 46మి.మీ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
వేములపల్లిలో భారీ వర్షం
వేములపల్లి మండలంలో బుధవారం రాత్రి నుండి గురువారం సాయంత్రం వరకు ఏకధాటిగా కుండపోత వర్షం కురిసింది. భారీగా వర్షం కురవడంతో 132.6మి.మీ వర్షాపాతం వేములపల్లి మండలంలో నమోదైంది. వర్షానికి పలు గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నారు. భారీ వర్షం కురవడంతో పాలేరువాగు పొంగిపొర్లుతుంది. దాంతో ఆగామోత్కూర్, చిరుమర్తి, భీమనపల్లి, బొమ్మకల్, కల్వలపాలెం, సల్కునూరు, రావులపెంట వద్ద కల్వర్టుల నిర్మాణం చేపడుతుండగా డైవర్షన్ రోడ్లను ఏర్పాటుచేశారు. అయితే డైవర్షన్‌రోడ్లు పాలేరువాగులో వరద ఉదృతికి కొట్టుకపోయాయి. దాంతో మిర్యాలగూడ- సూర్యాపేట వయా భీమారం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
పాలేరువాగు ప్రవహిస్తుండడంతో ఇరువైపులా గ్రామాలకు రాకపోకలు స్థంభించిపోయాయి. ఆమనగల్లులో గృహాల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. మండలంలోని చిత్రపరకవాగు పొంగిపొర్లడంతో వాగు పరివాహక ప్రాంతంలో నాట్లు వేసిన వరిపంట నీటమునిగింది. అదేవిధంగా చిన్నగూడెం, కుక్కడం, తోపుచర్లలోని రెండు చెరువులు, మొల్కపట్నం తదితర గ్రామాల్లోని చెరువులు వర్షానికి నిండి అలుగులు పోస్తున్నాయి. భారీ వర్షం కురవడంతో పలు గ్రామాల్లో సేద్యం చేసిన పత్తి, వరిపంటలు నీట మునిగాయి. దాంతో రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది.