నల్గొండ

మూసీకి తరలివస్తున్న పర్యాటకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, సెప్టెంబర్ 22: రెండవ అతిపెద్ద ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో పరిసర, సుదూర ప్రాంతాల నుండి భారీసంఖ్యలో పర్యాటకులు తరలివస్తూ మూసీ అందాలను తిలకించి మురిసి పోతున్నారు. గత శనివారం నాడు మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోగానే ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న నీటిని దిగువ మూసీకి పంపడానికి గేట్లు తెరిచినాటి నుండి రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. బుధవారం ప్రాజెక్టుకు వచ్చిన పర్యాటకుల సంఖ్యకన్న గురువారం రెట్టింపుస్థాయిలో కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పర్యాటకులు ప్రాజెక్టుకు తరలివచ్చారు. పర్యాటకుల కోసం ప్రభుత్వం, అధికారులు ఎలాంటి వసతులు ఏర్పాటుచేయకపోవడం వల్ల పర్యాటకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.