నల్గొండ

ప్రమాదకర స్థాయిలో త్రిపురారం చెరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపురారం, సెప్టెంబర్ 22: భారీ వర్షాలకు చెరువులు అలుగుపోస్తున్నాయి. రహదారిపై వర్షపునీరు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో బుధవారం రాత్రి నుండి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. మండల కేంద్రంలో లిటిల్‌ఫ్లవర్ పాఠశాల సమీపంలో 4అడుగుల మేరా వర్షపునీరు వెలిసింది. ప్రధాన రహదారిపై వర్షపునీరు ప్రవహిస్తుండడంతో రహదారి అంచులు కోతకు గురయ్యాయి. మండల కేంద్రం నుంచి అడవిదేవులపల్లికి వెళ్లే రహదారిలో తోటమడుగు, అంజన్‌పల్లి వాగు వరద రహదారిపై ప్రవహిస్తుండడంతో సుమారు 2గంటల పాటు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. బాబుసాయిపేట త్రిపురారం రహదారిపై మధ్యలో ఉన్న బందంపై వర్షపునీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. త్రిపురారం చెరువులో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. చెరువు పక్కన కట్టపై ఉన్న బెజ్జికల్ రహదారిపై నీరు వెళ్తుంది. చెరువు కింద ఉన్న వరిపొలాలు ఆనవాలు కనిపించడంలేదు. మరో 2గంటలపాటు వర్షం వస్తే చెరువుకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.