నల్గొండ

రైతు సమస్యలపై ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 22: బిజెపి ఆధ్వర్వంలో ఈ నెల చివరి వారంలో రైతాంగం సమస్యలపై ఉద్యమాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ బూత్ ఇన్‌చార్జిలు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతు రైతు రుణమాఫీ, ఇన్‌ఫుట్ సబ్సిడీ, ఫసల్ బీమా యోజన వంటి రైతాంగం సమస్యలపై రైతులను ఆందోళన దిశగా కదిలించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. సీఎం కెసిఆర్ ప్రభుత్వం రైతు రుణమాఫీని గందరగోళంగా మార్చిందన్నారు. దీంతో రైతులకు బ్యాంకర్లు కొత్త రుణాలివ్వకపోవడంతో రైతులు మరింత ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నాన్నారు. కేంద్రం మంజూరు చేసిన పెండింగ్ ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించాలన్నారు. ప్రాజెక్టులకు భూసేకరణ పేరుతో రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేయడాన్ని ప్రభుత్వం మానుకుని 2013చట్టం మేరకు నిర్వాసితులకు పరిహారం అందించాలన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను, ఇతరులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పోలింగ్ బూత్ స్థాయి దశదాకా పార్టీని బలోపేతం చేయాలని, అన్ని మండలాల నూతన కమిటీలను, అనుబంధ కమిటీలను భర్తీ చేయాలన్నారు. కేంద్రంలోన నరేంద్రమోదీ ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకవెళ్లి పార్టీని 2019ఎన్నికల దిశగా నడిపించాలన్నారు. సమావేశంలో బిజెపి సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, నాయకులు చంద్రశేఖర్, మధసూధన్‌రెడ్డి, నూకల వెంకటనారాయణరెడ్డి, రామోజీ షణ్ముక, పాదూరి కరుణ, ఓరుగంటి రాములు, పోతెపాక సాంబయ్య పాల్గొన్నారు.