నల్గొండ

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 22: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తు నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయం నుండి ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితి, ప్రాజెక్టుల నీటి నిల్వలను సమీక్షించారు. వాతావరణ శాఖ రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని హెచ్చరిస్తున్న నేపధ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడుతుండటం, రోడ్లపై వరదనీరు చేరడం, రైల్వే ట్రాక్‌లపై వరద వంటి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి పెట్టాలన్నారు. పులిచింతల ప్రాజెక్టులో 30టిఎంసిల కంటే ఎక్కువ నీటిని నిల్వ చేయరాదని గురువారం రెండు రాష్ట్రాలు నిర్ణయించాయని ఎప్పటికప్పుడు దిగువకు నీటి విడుదల జరిగేలా ప్రాజెక్టు అధికారులు చర్యలు కొనసాగించాలన్నారు. కేతెపల్లి మూసీ ప్రాజెక్టు నుండి నీటి విడుదల కొనసాగుతుందన్నారు. నార్కట్‌పల్లి అద్దంకి రహదారితో పాటు మూసీ ప్రాంతాల్లో, ఇతర మండలాల్లో రోడ్లపై వరద నీరు ప్రవాహం కొనసాగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 4,762చెరువులకు 650చెరువులకు పైగా అలుగులు పోస్తున్నాయన్నారు. మరో 608చెరువుల్లో 75శాతం నీరు చేరగా, 1574చెరువుల్లో 50శాతంకు పైగా, 711చెరువుల్లో 25శాతం మేరకు వరదనీరు చేరిందన్నారు. మూసీ ఫీడర్ చానెల్స్‌తో పాటు 33చెరువులకు గండ్లు పడ్డాయని వాటి పూడ్చివేతకు, రహదారుల మరమ్మతులకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ముందస్తు చర్యలతో సిద్ధం : కలెక్టర్
జిల్లాలో వర్షాలు పడుతున్నందునా అధికారులు, ఆర్డీవోలు, ఎంపిడివోలు, తహశీల్ధార్లను, క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి నష్ట నివారణకు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని చర్యలు కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. చెరువులకు, కాలువలకు గండ్లుపడే అవకాశమున్నందునా గ్రామాల ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండి పనిచేయాలని ఎలాంటి సెలవులు పెట్టరాదన్నారు. నిర్వాసితులయ్యే అవకాశమున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలన్నారు. సంబంధిత సమాచారాన్ని కలెక్టర్, జెసి, ఎజెసి, డిఆర్‌వోలకు నివేధించాలన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ 18004251442నెంబర్‌తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఇదే రీతిలో ప్రతి డివిజన్ కేంద్రంలో తహశీల్ధార్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు 24గంటలు పనిచేసేలా ఏర్పాటు చేసి సమాచారాన్ని జిల్లా కంట్రోల్‌రూంకు తెలుపాలని సూచించారు. రోడ్లు ధ్వంసమైతే వాహనాల రాకపోకలను మళ్లించాలన్నారు. హెచ్చరికలతో కూడిన ఎరుపు జెండాలను అమర్చాలన్నారు. రైల్వే ట్రాక్‌ల వెంట పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులు పారిశుధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో పర్యటించాలన్నారు.
పట్టణంలో భారీ వర్షం
నల్లగొండ టౌన్: ఎడతెరపి లేని వర్షాలు జిలాల కేంద్రం నల్లగొండను గురువారం రోజంతా ముంచెత్తాయి. రోజుంతా కురిసిన వర్షాలు, వరదలతో డ్రైనేజిలు పొంగి వరద నీరు రోడ్ల మీదకు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, ఇళ్లలోకి చేరింది. శివాజీనగర్, గుట్ట దిగువ కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఎడతెరపిలేని వర్షంతో విద్యార్థులు, ఉద్యోగులు, రోజుకూలీలు, కార్మికులు ఇబ్బందులు పడ్డారు.
భారీ వర్షంతో నిలిచిపోయన రాకపోకలు
తిప్పర్తి: మండలంలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. కోమటకుంట అలుగు పోసి వరద నీరు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సబ్ స్టేషన్ ప్రాంగణం జలమయమై విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాశివారిగూడెం, గంగన్నపాలెం, సిలార్‌మియాగూడెం, తిప్పర్తిల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.