నల్గొండ

శేశిలేటివాగులో పడి విద్యార్థి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, సెప్టెంబర్ 23: వర్షం గత మూడు రోజుల నుంచి విపరీతంగా కురుస్తుండటంతో గ్రామంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం అప్రమత్తమై బడులకు సెలవు ప్రకటించడంతో మొదటి రోజే మండంలోని గానుగుపల్లి గ్రామానికి చెందిన మానాల సాయికుమార్(14) శుక్రవారం శేశిలేటివాగు నుండి వచ్చే వరదనీరు గానుగుపల్లిలో విపరీతంగా పారుతుండటంతో విద్యార్ధి అందులో పడి గల్లంతయ్యాడు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు, అదికారులు అప్రమత్తమై విద్యార్ధి మృతదేహానికై గాలిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మానాల నర్సింహ్మ,కవితల కుమారుడు మానాల సాయికుమార్ చండూరు మండల కేంద్రంలో కృష్ణవేణి స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. వర్షాల కారణంగా ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవు ప్రకటించడంతో విద్యార్ధి సాయికుమార్ చెరువుదగ్గరకు సైకిల్‌మీద వచ్చాడు. చెరువు కట్ట దాటి మరల ఇంటికి వెళ్తుండగా చెక్ డ్యాంకు ఉన్న ఆనవాలు తెలవకపోవడంతో జారిపడి కేకలు వేయడంతో ఇదే గ్రామంలో పోచంపల్లికి చెందిన కేబుల్ ఆపరేటర్ తిరుమల్‌రెడ్డి అక్కడినుంచి వెళ్తుండగా విద్యార్ధి రక్షించమని కేకలు వేయడంతో అడుగుల వరకు వెళ్లి పట్టుకొనగా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో విద్యార్ధి అక్కడికక్కడే వాగులో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన గ్రామస్తులు పోలీసులకు పై శాఖ అధికారులకు సమాచారం అందించగా హుటాహుటినా చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని శాఖల సిబ్బంది అక్కడే ఉండి బాధితుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందుబాటులో ఉన్న ఫైరింజన్‌తో, నల్లగొండ నుంచి గజ ఈతగాళ్లను, రిస్క్యుటీంను పిలిపించి ముమ్మర ప్రయత్నం చేశారు. ఇంత వరకు మృతదేహం చాడ కనిపించకపోవడంతో మరల ప్రొక్లేన్ సహాయంతో డ్యాంను బ్లాక్ చేసి రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు నీటిని వదులుతున్నారు. దీంతో రాత్రి వరకు పనులు జరిగే అవకాశం ఉంది. ఈ సంఘటనతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా శెశిలిటివాగు(గానుగుపల్లి) చెరువులో గల్లంతైన విద్యార్ధి సాయికుమార్ చెరువులో కొట్టుకుపోయిన సంఘటన స్ధలాన్ని మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, దేవరకొండ ఆర్‌డిఒ గంగాధర్, డి ఎస్పీ చంద్రమోహన్, నాంపల్లి సి ఐ బాల గంగిరెడ్డి, ఎంపిడిఒ హనుమాన్‌ప్రసాద్, తహశీల్ధార్ ఎండి.ఖలీల్‌తో పాటు వివిధ శాఖల అధికారులు సంఘటన స్థలానికి వచ్చి చెరువు పనితీరు, స్ధలాన్ని పరిశీలించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తమై సిబ్బంది సహాయంతో తగు చర్యలు చేపట్టి, జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులతో మమేకమై తగు ఏర్పాటు చేశారు. ఉదయం ఉంచి సాయంత్రం వరకు విద్యార్ధి శవం కోసం వెతికారు. పలు మూలల పోలీసు సిబ్బంది, అధికారులు గస్తీ వేశారు. ఈ సంఘటన స్థలంలో నాంపల్లి, గుర్రంపోడు, మర్రిగూడ, దేవరకొండ మండలాల ఎస్ ఐలు, అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.