నల్గొండ

మూసీకి వరద ఉదృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, సెప్టెంబర్ 23: నల్లగొండ జిల్లాలో రెండవ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల వల్ల అధికస్థాయిలో వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు తొమ్మిది క్రస్ట్‌గేట్లను శుక్రవారం 8అడుగుల మేర ఎత్తులేపి 41వేల క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. తొలుత ఐదు గేట్లను 5 అడుగుల మేర ఎత్తగా నీటి ప్రవాహాం అధికమవ్వడంతో మధ్యాహ్నానానికి 8గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి 30,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే రాత్రి మరింత ప్రవాహాం పెరగడంతో మరో గేటును పైకి ఎత్తి మొత్తం తొమ్మిది గేట్ల ద్వారా ఇన్‌ఫ్లోగా వస్తున్న 41వేల క్యూసెక్కుల నీటిని అదే స్ధాయికి దిగువకు వదలుతున్నారు. ప్రాజెక్టు ఎడమకాల్వకు 200క్యూసెక్కులు, సూర్యాపేట పట్టణవాసుల తాగునీటి కోసం 50క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు కాగా ప్రాజెక్టులో నిలకడగా 643అడుగుల నీటినిల్వ ఉండే విధంగా చూస్తున్నట్లు ప్రాజెక్టు డిఈ నవికాంత్, ఎఇ రమేష్‌లు తెలిపారు.