నల్గొండ

జిల్లాలో మెడికల్ ఎమర్జన్సీ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 25: నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ ఆదేశం ప్రకారం మెడికల్ ఎమర్జన్సీని విధించామని అమలులో ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.్భనుప్రసాద్‌నాయక్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రకాష్‌నగర్, తాళ్లగడ్డ ప్రాంతాలను ఆయన సందర్శించిన అనంతరం స్థానిక క్లస్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా భారీవర్షం, వరద బీభత్సం వల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టేందుకు గాను అటెండర్ నుండి వైద్యాధికారి వరకు ప్రతి ఒక్కరు విధుల్లో 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించామన్నారు. ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ప్రతి రోజు సాయంత్రం వారి పరిధిలో రోగాలపై నివేదికలివ్వాలని ఆదేశించామని ఆయన అన్నారు. కేతేపల్లి మండలం కొండమీదిగూడెంలో అనుమానాస్పద డెంగ్యు జ్వరం కేసుతో వంద మంది సెరం సేకరించి పరీక్షలకు పంపగా, వాటిలో డెంగ్యు లక్షణాలు కనపడలేదని ఆయన అన్నారు. అదే విధంగా సూర్యాపేటలో ఒక పాపకు డెంగ్యు అని చెప్పగా పరీక్షలు నిర్వహించగా డెంగ్యు జ్వరంగా తేలలేదని ఆయన అన్నారు. మిర్యాలగూడ పట్టణం ప్రకాష్‌నగర్‌లో స్వైన్‌ఫ్లూ జ్వరంతో బాలింత ఎ.జ్యోతి మరణించిందన్న విషయంపై ఆరా తీసామన్నారు. ఆమెకు హెచ్-1 వైరస్ ఉండటం, అదే విధంగా ఊపిరితిత్తుల సమస్య ఉండటం వల్ల చనిపోయిందని ఆయన అన్నారు. స్వైన్‌ఫ్లూ నవంబర్, డిసెంబర్ మాసాల్లో వస్తుందని, ఇప్పుడు రాదని ఆయన అన్నారు. డెంగ్యు, స్వైన్‌ఫ్లూ ఊహాగానాలతో భయాలకు గురి కావద్దని ఆయన కోరారు. పట్టణాల్లో గ్రామాల్లో నీటి నిల్వ వల్ల పందులు, దోమలు పెరిగి పోతున్నాయని వాటిని నివారించేందుకు మునిసిపాలిటిలు, గ్రామపంచాయతీలను కోరామన్నారు. అదే విధంగా సీజనల్ రోగాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన అన్నారు. ప్రకాష్‌నగర్, తాళ్లగడ్డ సందర్శించి అక్కడ ప్రజలతో డిఎం అండ్ హెచ్‌ఓ మాట్లాడారు.