నల్గొండ

మూసీకి కొనసాగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, సెప్టెంబర్ 25: భారీ వర్షాలకు మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మూసీ నదికి ఆదివారం కూడా వరద కొనసాగడంతో వరద పరిస్థితి బట్టి అధికారులు ఎప్పటికప్పుడు గేట్లను ఎత్తి, దింపుతున్నారు. ఉదయం వరద ప్రవాహం తక్కువగా ఉండడంతో రెండు గేట్ల ద్వారా మూడు అడుగుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు మధ్యాహ్నానికి వరద ప్రవాహం 25వేల క్యూసెక్కుల మేర రావడంతో 5,7,9 గేట్లను దశల వారీగా ఐదు అడుగుల మేర ఎత్తి 28వేల క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదలచేస్తున్నారు. సాయంత్రానికి వదర ప్రవాహం తగ్గి 11వేల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 5గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 11వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 643అడుగులు మేర నీటిని నిల్వచేస్తూ వరదను దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు డిఈ నవికాంత్, ప్రాజెక్టు ఏఈ రమేష్‌లు తెలిపారు. ఆదివారం సెలవు రోజుకావడంతో ప్రాజెక్టును సందర్శించేందుకు జనం పోటెత్తారు. ఉదయం నుండే జనం సందడి ప్రారంభం కాగా మధ్యాహ్ననికి ప్రాజెక్టు పరిసరాలు పర్యాటకులతో కిటకిటలాడాయి. ప్రాజెక్టు కట్టలపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. పర్యాటకుల సందడి అధికంగా ఉన్నా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు, సహాయకచర్యలు చేపట్టలేదు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రాజెక్టు కట్టలపై వాహనాలు కదలక ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం పర్యాటకులు అధికంగా ఉంటారని తెలిసినప్పటికి అటు అధికారులు, ఇటు పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, పర్యాటకులకు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేశారు. డ్యామ్‌ను పరిశీలించేందుకు విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే వీరేశంలు వస్తారని అధికారులు తెలిపినప్పటికి చివరకు వారి పర్యటన రద్దు అయింది.