నల్గొండ

శాంతించిన వరుణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 25: జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలతో జన జీవనాన్ని అతలాకుతలం చేసిన వరుణుడు ఆదివారం శాంతించాడు. పలు మండలాల్లో చిరుజల్లులు పడగా జిల్లా వ్యాప్తంగా 8.3మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. జిల్లాలో మూసీ నదిలో వరద ఉదృతి కొనసాగుతుండగా కేతెపల్లి మూసీ ప్రాజెక్టు నుండి తొమ్మిది గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుద సాగిస్తున్నారు. ఇన్‌ఫ్లో 20వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 18వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. మేళ్లచెర్వు పులిచింతల ప్రాజెక్టులో 30టిఎంసిల నీటి నిల్వ కొనసాగిస్తుండగా రెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 55వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. నీటి విడుదల చూసేందుకు పర్యాటకుల సందడి నెలకొంది.
వరుస వర్షాలతో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాలువలకు, రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయించడంలో ఇరిగేషన్, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి శాఖలు నిమగ్నమయ్యాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు పొంచి ఉన్నాయన్న హెచ్చరికల నేపధ్యంలో నిండిన చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. మరోవైపు వ్యవసాయ శాఖ ప్రస్తుతం పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు రూపొందిస్తుంది. ఇప్పటిదాకా 15వేల హెక్టార్ల మేరకు వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 1240చెరువులు పూర్తిగా నిండగా 1190చెరువులు 75శాతంకు పైగా నిండాయి. ఇతర చెరువులు కూడా జలకళను సంతరించుకున్నాయి. కనగల్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి, భువనగిరి, బీబీనగర్, వలిగొండలలో ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిలను నిండిన చెరువులను సందర్శించి గంగా పూజలు చేశారు.
50 మండలాల్లో వర్షాలు
జిల్లా వ్యాప్తంగా సగటు 8.3మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదవ్వగా, అత్యధికంగా ఆత్మకూర్(ఎం) మండలంలో 60.4మిల్లిమీటర్లు, చందంపేటలో 34.2, గుండాలలో 26.6, తిరుమరగిలిలో 23.2, బొమ్మలరామారంలో 20.6, శాలిగౌరారంలో 20.2, తుంగతుర్తిలో 19.2, యాదగిరిగుట్టలో 16.8, గుర్రంపోడులో 15, హాలియాలో 14.4, బీబీనగర్‌లో 14.2, తుర్కపల్లిలో 12.4, డిండిలో 11.2, మఠంపల్లిలో 11, పోచంపల్లి 10.6, భువనగిరిలో 9.2, గరిడేపల్లిలో 9, తిపర్తిలో 9, కనగల్‌ళో 8.8, ఱాజాపేటలో 8.2, కట్టంగూర్‌లో 8.2, నేరడుచర్లలో 8.2, నిడమనూర్‌లో 7.8, నడిగూడెంలో 7.8, పిఏపల్లిలో 6.4, వేములపల్లిలో 6.2, త్రిపురారంలో 6.2, అర్వపల్లిలో 6.2, ఆలేరులో 6, దేవరకొండలో 6, నల్లగొండలో 5.6, నకిరేకల్‌ళో 5.4, వలిగొండో 5.2, కేతెపల్లిలో 4.8, దామరచర్లలో 3.6, మిర్యాలగూడలో 3, సూర్యాపేటలో 3మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది.