నల్గొండ

నేటి నుంచి బతుకమ్మ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 29: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకయైన పూల పండుగ బతుకమ్మ ఉత్సవాలను నేటి నుండి వచ్చే నెల 9వ తేది వరకు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం యంత్రాంగం సన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వాహణకు కొత్త జిల్లాల విభజనను అనుసరించి నల్లగొండకు 10లక్షలు, సూర్యాపేట, యాదాద్రిలకు 5లక్షల చొప్పున మొత్తం 20లక్షలు కేటాయించడం విశేషం. జిల్లాల వారీగా అన్ని ప్రభుత్వ శాఖలు బతుకమ్మ ఉత్సవాల నిర్వాహణకు ఏర్పాట్లు చేసుకోగా కొత్త జిల్లాల్లో డివిజన్ల వారిగా ఆర్డీవోలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జాగృతి శ్రేణులు సన్నద్ధమయ్యాయి.
బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం : ఎజెసి
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బతుకమ్మ ఉత్సవాల నిర్వాహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఎజెసి ఐ.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30నుండి ఆక్టోబర్ 9వ తేది వరకు బతుకమ్మ ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. బతుకమ్మ పండుగను జిల్లా కేంద్రాల్లో, రెవెన్యూడివిజన్ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో గ్రామస్థాయిలో ఘనంగా నిర్వహించనున్నామన్నారు. జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణంలోని ఎన్‌జి కళాశాల మైదానంలో నేటి నుండి వచ్చే నెల 8వరకు బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్ మైదానాన్ని సిద్ధం చేసి వేదిక, లైటింగ్, సౌండ్స్, తాగునీటి వసతులు కల్పించాలన్నారు.
బతుకమ్మ వేడుకల్లో తొలి రోజు శుక్రవారం రెవెన్యూ, ఐసిడిఎస్, సహకార శాఖ, దేవాదాయ శాఖల సిబ్బంది పాల్గొంటారన్నారు. ఆక్టోబర్ 1న పోలీస్, ఎపిఎస్పీ 12వ బెటాలియన్, ఎక్సైజ్‌శాఖ, ఫైర్, అటవీ, రవాణాశాఖల సిబ్బంది, 2వ తేదిన మున్సిపాల్టీ, ట్రాన్స్‌కో, మత్స్యశాఖల సిబ్బంది, 3వ తేదిన ఎన్‌జి కళాశాల, ఆర్‌ఐవో, ఆర్‌అండ్‌బి, గృహనిర్మాణశాఖ, 4వ తేదిన విద్యాశాఖ, ఎస్‌ఎస్‌ఏ, వయోజన విద్య, కార్మికశాఖ, వ్యవసాయశాఖ, కేంద్రీయ విద్యాలయం, స్టెప్ శాఖల సిబ్బంది, 5వ తేదిన డ్వామా, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖ, భూగర్భజలవనరులశాఖ, 6న జిల్లా వైద్యఆరోగ్యశాఖ, డిసిహెచ్‌ఎస్, పరిశ్రమలు, ఎఎమ్మార్పీ, ఇరిగేషన్, ఐటిఐ, ఎంజి యూనివర్సిటీ, 7న పౌరసరఫరాలశాఖ, పౌరసరఫరాల సంస్థల సిబ్బంది, 8న సంక్షేమ శాఖలు, కార్పోరేషన్లు సిబ్బంది, డిఆర్‌డిఏ, ఐకేపి, సిపివో, పట్టు పరిశ్రమ, మాడాశాఖల సిబ్బంది, 9వ తేదిన జడ్పీ, డిపివో, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్ సిబ్బంది బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని నిర్ణయించామన్నారు. మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలను బతుకమ్మ వేడుకలకు హాజరుపరుచాలన్నారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే బృందాలకు మొదటి బహుమతి 1000, రెండో బహుమతి 500, మూడో బహుమతి 300నగదు పురస్కరాలతో పాటు మోమోంటో, సర్ట్ఫికెట్లను అందించాలని సూచించారు.
జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఉత్సవాలను స్థానిక ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. బతుకమ్మ వేడుకలకు రాత్రి వేళ విద్యుత్ కొరత లేకుండా ట్రాన్స్‌కో యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలన్నారు. బతుకమ్మ కుంట, మోతికుంటలను బతుకమ్మ నిమజ్జనం చేసేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధం చేయాలన్నారు. ఉత్సవాల్లో అవసరమైన చోట ఆర్‌అండ్‌బి శాఖ బారికేడ్ల నిర్మాణం చేయాలన్నారు. వ్యవసాయ, విద్యాశాఖల ఆధ్వర్యంలో ప్రతి రోజు ఎన్‌జి కళాశాల మైదానంలో రాత్రి 6నుండి 10గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఏ పిడి అంజయ్య, జెడిఎ నర్సింహరావు, మెప్మా పిడి కిరణ్‌కుమార్, డిఈవో చంద్రమోహన్, ఆర్డీవో వెంకటాచారి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణలు పాల్గొన్నారు.