నమ్మండి! ఇది నిజం!!

ఇల్లు కాని ఇల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నగరాలలోని ప్రధాన సమస్య ఇంటి అద్దె. సామాన్యులు దాన్ని భరించలేరు. దాంతో అనేక ప్రత్యామ్నాయాలని కనిపెడుతున్నారు. టోక్యోలో కేవలం మనిషి పడుకునేంత కొలతలు గల పెట్టెలని అద్దెకి ఇస్తారు. కామన్ బాత్‌రూమ్స్ వాడుతూ రాత్రి పడుకుని పగలు ఆఫీసులకి వెళ్లిపోతారు. విలువైన వస్తువులను దాచుకోవడానికి చిన్న ఐరన్ సేఫ్‌లను ఇస్తారు.
శాన్‌ఫ్రాన్సిస్కోలో కూడా ఇదే సమస్య. సింగిల్ బెడ్‌రూం అపార్టుమెంట్ అద్దె నెలకి 3,500 డాలర్లు. ఇది సగటు మధ్య తరగతి వ్యక్తి తీసుకునే జీతంలో సగం. దాంతో యువ ప్రొఫెషనల్స్ ఆసక్తికరమైన కొత్త మార్గాలని కనిపెడుతున్నారు. శాన్‌ప్రాన్సిస్కో సమీపంలోని ఓక్లాండ్ ప్రాంతంలో ఓ గ్రామం నిండా షిప్పింగ్ కంటైనర్స్ కనిపిస్తాయి. వీటినే కొందరు ఇల్లులా మార్చుకుని వాటిలో నివశిస్తున్నారు. ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి ఆరు బయట ఉన్నా సమస్య ఉండదు. 1600 చదరపు అడుగుల ఆ లోహపు పెట్టెకి గాజు కిటికీలు, ఎలక్ట్రిసిటీ, బాత్‌రూం సౌకర్యాలు ఉంటాయి. దీని నెలసరి అద్దె 600 డాలర్లు. వీటికి ‘కంటైనర్‌కోపియా’ అని పేరు.
తన మాజీ భార్య హీదర్‌తో కలిసి వీటిని లూక్ ఐస్‌మేన్ (32) కనిపెట్టాడు. అధిక అద్దెలు చెల్లించి విసిగిపోయిన ఆ జంట ప్రత్యామ్నాయం ఆలోచించి ఓక్లాండ్ నౌకాశ్రయం నుంచి 2,300 డాలర్లకి ఓ షిప్పింగ్ కంటైనర్ కొన్నారు. తుపానులనుంచి తట్టుకునేలా నిర్మించబడ్డ ఆ షిప్పింగ్ కంటైనర్ అన్నిరకాల వాతావరణానికి అనుకూలమైంది. అర ఎకరం అద్దెకు తీసుకుని అందులో దాన్ని ఉంచి ఆ పెట్టెని 12,000 డాలర్లు ఖర్చు చేసి ఇల్లులా మార్చారు. సోలార్ పేనల్స్ అమర్చి విద్యుచ్ఛక్తి సరఫరాని పొందుపరుస్తున్నారు. అది బాగుండడంతో 4,25,000 డాలర్లకి మరో ఖాళీ స్థలాన్ని కొని అక్కడ అలాంటి మరికొన్ని ఇళ్లు ఏర్పాటుచేసి అద్దెకి ఇవ్వసాగారు. ఆ విధంగా కంటైనర్ కోపియా గ్రామం ఉద్భవించింది.
ఐతే కొన్ని వారాల తర్వాత పొరుగువాళ్లు వీళ్లు అద్దెకి తీసుకున్న ప్రదేశం రెసిడెన్షియల్ జోన్ కాదని ఫిర్యాదు చేసారు. దాంతో ఆ ఇళ్లన్నిటినీ సమీపంలోని మరో ఖాళీ ప్రదేశానికి తరలించారు. ఖాళీ చేసిన ఆ ప్రదేశంలో గ్రామానికి సరిపడే కూరగాయలని పండిస్తున్నారు. ఏదేశంలోనైనా, ఏ నగరంలోనైనా కంటైనర్‌కోపియా హేచ్చు అద్దెలకి చక్కటి పరిష్కారం అని లూక్ నమ్ముతున్నాడు. అతని భార్య హీదర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ గ్రామ వ్యవహారాలు చూసే మేనేజర్‌గా మారింది.
‘‘కంటైనర్‌కోపియా వల్ల జరిగే మేలు, కేవలం అవసరమైన వస్తువులతోనే నివశించడం.వీటిని చవక షెడ్లలో ఉంచితే ఇంట్లోంచి బయటిక రాగానే వర్షంలోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోఉన్నాం.’’ అతను చెప్పాడు.
శాన్‌ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాకి చెందిన సారా కార్టర్ (23) హెచ్చు అద్దెకి ప్రత్యామ్నాయంగా మరో పరిష్కారాన్ని కనిపెట్టింది. ఇంజన్‌లేని సెకండ్ హేండ్ పడవని 9,600 డాలర్లకి కొని అందులో నివశించసాగింది. ఐదు నెలలు నివశిస్తే ఆదా చేసే అద్దెతో బోటు ఖర్చు వచ్చేస్తుంది. చాలామంది ఈమె మార్గాన్ని అనుసరించి పాత పడవలని కొంటున్నారు. మరికొందరు పాత బస్సులని కొని లోపల బంక్ బెడ్స్ అమర్చుకుని అందులో నివశిస్తున్నారు. సాంప్రదాయ ఇళ్ల నిర్మాణానికి చాలా ఖర్చవుతుంది. ఇళ్లలా ఉపయోగించే వీటికి అంత ఖర్చు కాదు.
ఇదిలావుండగా కేలిఫోర్నియాలోని వౌంటెన్ వ్యూలో గూగుల్ కార్యాలయంలో పనిచేసే ఎస్.బ్రాండెన్ (23) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కార్యాలయంలోని విశాలమైన పార్కింగ్ లాట్‌లో పార్కు చేసిన పెద్ద వేన్‌ని ఇల్లుగా మార్చుకుని అందులో నివశిస్తున్నాడు. 2014లో గూగుల్‌లో బ్రాండాన్ ఇంటర్న్‌గా చేరినపుడు రెండు పడకగదుల అపార్టుమెంట్‌ని ముగ్గురు రూం మేట్స్‌తో పంచుకుంటే, అతనికి నెలకి రెండు వేల డాలర్ల అద్దెచెల్లించాల్సి వచ్చేది. కేవలం నిద్రించడానికే వచ్చే ఇంటికి అంత అద్దె చెల్లించడం అతనికి వృధా అనిపించింది. ఇంటర్న్‌నుంచి అతను ఫుల్ టైం ఎంప్లాయిగా మారాక పదివేల డాలర్లకి ఫోర్డ్ ఇ 350 వేన్‌ని కొని అందులో నివశించసాగాడు. నిద్రపోవడానికి, తన సామాను దాచుకోడానికి దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాడు. గూగుల్ ఆఫీసులోనే స్నానం చేస్తాడు. అక్కడి కేంటిన్‌లోనే భోంచేస్తాడు. తన ఎలక్ట్రానిక్ పరికరాలని ఆఫీసులోనే చార్జి చేసుకుంటాడు. అతను ఖర్చు చేసేదల్లా ఆ వేన్ ఇన్సూరెన్స్‌కి నెలకి 121 డాలర్లు మాత్రమే. రాత్రిళ్లు ఎక్కువసేపు పనిచేసి నిద్ర ముంచుకు వస్తున్నప్పుడు మాత్రమే ఆ లారీలోకి వెళ్తాడు. అతనికి 24 గంటలు గూగుల్ ఆఫీసు తలుపుతెరుచుకుని వెళ్లే కీ కార్డ్ ఉంది.
రాత్రి ఏడున్నర తర్వాత అతను ఏమీ తాగడు. తినడు. రాత్రి పడుకోవడానికి వెళ్లేటప్పుడు బాత్‌రూంని ఉపయోగించి వెళ్తాడు. అందువల్ల మధ్యలో బాత్‌రూంకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అతనికి కావాల్సింది పడక మాత్రమే. దానిమీద లేనప్పుడు గూగుల్ ఆఫీసులోనే వుంటాడు. వేన్‌లో మోషన్‌సెన్సిటివ్‌తో నడిచే ఓవర్‌హెడ్ లైట్స్ ఉన్నాయి. దానికున్న చిన్న బేటరీ పేక్‌ని రెండుసార్లు ఆఫీసులో ఛార్జ్ చేసుకుంటాడు. ప్లగ్‌కి గుచ్చి ఉపయోగించే ఏ ఎలక్ట్రిక్ పరికరాన్ని అతడు ఉపయోగించడు. కాబట్టి వేన్‌లో ఎలక్ట్రిసిటీ లేకపోయినా ఇబ్బంది లేదు. ఆ వేన్‌లో డ్రెసింగ్ టేబుల్, సూట్ హేంగర్లు తగిలించే సౌకర్యం మాత్రమే ఉన్నాయి. ఎలకల్లాంటివి రాకూడదని అందులో ఏమీ తినడు. అతను విద్యార్థిగా తీసుకున్న అప్పులని అందులో నివశిస్తూ ఆర్నెల్లలో తీర్చేసాడు. ఆ వాహనం ధర కూడా బయట అద్దెకుంటే చెల్లించే అద్దెతో పోల్చుకుంటే వచ్చేసింది. బ్రాండన్ ఇల్లు లేనివారిని ప్రోత్సహించే ఉపన్యాసాలు తరచు ఇస్తుంటాడు. ఇందుకు గూగుల్ మద్దతు కూడా అతనికి లభిస్తోంది. ఈ విధంగా ఇతను తన జీతంలోని 90 శాతం ఆదా చేస్తున్నాడు.
ఇదిలావుండగా ఓక్లాండ్ నివాసి, వృత్తిరీత్యా శిల్పి అయిన గ్రెగరీ (42) అనే అమెరికన్ ‘హోంలెస్ హోమ్స్ ప్రాజెక్ట్’ అనే ట్రస్ట్‌ని ఏర్పాటుచేసి వీధుల్లో నివసించే వారికి మొబైల్ హోమ్స్‌ని ఉచితంగా తయారుచేసి ఇస్తున్నాడు. రీసైకిల్డ్ వస్తువులతోనే వీటిని తయారుచేస్తున్నాడు. చక్రాలు అమర్చడంతో వీటిని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. ఈ చెక్క ఇంట్లోకి అడుగుపెట్టగానే పడుకోవాలి. ఎందుకంటే లోపలికి వెళ్లే కొద్దీ రూఫ్ ఎత్తు తగ్గిపోతుంది. పారిశ్రామిక వాడల్లోని చెత్త డబ్బాల్లో పారేసిన చెక్కలని, ఇతర సామగ్రిని సేకరించి ఇతను ఇప్పటిదాకా పదిళ్లు తయారుచేసిచ్చాడు.

- పద్మజ