నమ్మండి! ఇది నిజం!!

మెక్‌డొనాల్డ్స్ ప్రేమికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాకి చెందిన మెక్‌డోనాల్డ్స్ రెస్ట్‌రెంట్ బ్రాంచ్‌లు ప్రపంచంలోని చాలా దేశాల్లో విస్తరించుకున్నాయి. అమెరికాలోని ఆ రెస్ట్‌రెంట్లో దొరికే అన్ని పదార్థాలు అన్ని దేశాల్లో లభించవు. ఇలా ఓ దేశానికి చెందిన మెక్‌డోనాల్డ్స్ మెనూలోని ఐటెంస్ మరో దేశంలో లభించవు. స్థానిక రుచులని బట్టి మెక్‌డోనాల్డ్స్ ప్రతీ దేశంలో కొత్త ఆహార పదార్థాలని ప్రవేశపెడుతూంటుంది. ఉదాహరణకి ఇండియాలోని మెక్‌డోనాల్డ్స్‌లో దొరికే ఆలూ టిక్కీ, మేక్ వెజ్జీ లాంటి శాకాహార పదార్థాలు ఇతర దేశాల్లోని మెక్‌డోనాల్డ్ రెస్ట్‌రెంట్స్‌లో లభించవు. అలాగే మకావూ దేశంలోని ఓరియో మేక్‌ఫ్లర్రీ ఇతర దేశాల్లోని మెక్‌డొనాల్డ్స్‌లో లభించవు.
అమెరికా, కెనడాలోని చాలామంది నిత్యం తమ లంచ్‌ని మెక్‌డొనాల్డ్స్‌లోనే తింటూంటారు. కెనడాలోని హేమ్‌హెర్‌స్ట్‌బర్గ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జేమ్స్ మేక్‌గోవన్‌కి మెక్‌డొనాల్డ్స్‌లో దొరికే ఆహారం అంటే ఇష్టం. మామూలు ఇష్టం కాదు. గాఢమైన ఇష్టం. దాంతో విదేశాల్లోని మెక్‌డీ రెస్ట్‌రెంట్లలో దొరికే అన్ని పదార్థాలని రుచి చూడటం అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం ఆయా దేశాలకి ప్రయాణాలకి, బసకి చాలా ఖర్చు చేశాడు.
2009లో జేమ్స్ మెక్‌డొనాల్డ్ టేస్టింగ్ ట్రిప్‌ని ఆరంభించి ఇంతదాకా 53 దేశాలకి వెళ్లి అక్కడ దొరికే స్థానిక మెక్ డొనాల్డ్స్ పదార్థాలని రుచి చూశాడు. అక్టోబర్ 2011లో మొదటిసారిగా మకావూలోని మెక్‌డొనాల్డ్స్ రెస్ట్‌రెంట్ మేనేజర్ సలహా మీద ట్రావెలింగ్ మెక్‌డీ అనే ఓ బ్లాగ్‌ని తెరిచి అందులో తను రుచి చూసిన పదార్థాల గురించి రివ్యూ చేయడం ఆరంభించాడు. మొత్తం 300 మెక్‌డొనాల్డ్స్ రెస్ట్‌రెంట్లని సందర్శించి 340 రివ్యూలని రాశాడు. ఇంకా వాటిని కొన్న బిల్లులు, ఎన్ని కేలరీలు మొదలైన వివరాలు ఇస్తాడు. ఆ ఐటెంస్‌కి రేటింగ్ కూడా ఇస్తున్నాడు. అలా అతను రివ్యూ చేసిన మొదటి పదార్థం ఓరియో మేక్‌ఫ్లెర్రీ. అతను రష్యా, మలేషియా, తాహితీ, గ్రీస్, జర్మనీ, ఖతార్.. ఇలా 53 దేశాల్లో దొరికే మేక్ డెలికసీలని రివ్యూ చేశాడు. ఇలా ఇంతదాకా 300 ఐటెంస్‌కి రివ్యూ రాశాడు. తను తినే ప్రతీ ఐటంని ఫొటో తీసి బంధుమిత్రులతో వాటిని పంచుకోవడమే కాక ఆ బ్లాగ్‌లో పోస్ట్ చేస్తాడు.
అతనికి నచ్చిన ఐటమ్స్, సింగపూర్‌లో మాత్రమే దొరికే క్రీమీ బ్రూలీ మేక్‌ఫ్లర్రీ. థాయ్‌లేండ్‌లో మాత్రమే దొరికే సాల్‌మన్ (చేప) బర్గర్, టెరియాకి రైస్, జపాన్‌లో మాత్రమే దొరికే టోఫూ నగ్గెట్స్, సౌత్ కొరియాలో దొరికే ఛురోస్, హాంకాంగ్‌లో దొరికే చిలీ ఆల్పెనో టాపింగ్‌తో వచ్చే పైనాపిల్ బర్గర్.
ప్రాంతాన్నిబట్టి బర్గర్‌లలో వాడే బన్స్, ఫిల్లింగ్స్, పరిమాణాల్లో తేడా ఉంటుందని జేమ్స్ చెప్పాడు. ఈ స్థానిక వంటకాలని మెక్‌డొనాల్డ్స్ తమ రెస్ట్‌రెంట్లని ఆరంభించబోయే ఆయా దేశాల్లో ముందుగా ప్రజలు ఇష్టపడే వంటకాలని పరిశోధించి వాటి రుచికి అనుగుణంగా కొత్తవి అభివృద్ధి చేస్తూంటారు. ఐతే ఇవి తక్కువ సమయంలో తయారుచేయగల ఫాస్ట్ఫుడ్ అయి ఉండాలి. ధర అందుబాటులో ఉండాలి అనే నియమాన్ని పాటిస్తారు. జపాన్‌లో మెక్‌ఫ్రైస్ (ఫ్రెంచ్ ఫ్రైస్) మీద నలుపు, తెలుపు చాక్లెట్ టాపింగ్స్‌తో సర్వ్ చేస్తారు. కౌలాలంపూర్‌లోని లిచీ పై మెక్‌గోవన్‌కి అసలు నచ్చని మెక్‌డీ ఐటెం. దీనికి జీరో రేటింగ్ ఇచ్చాడు. ఏపిల్ పైలా కాక ఇది బాగా పుల్లగా ఉండి, పై క్రస్ట్‌కి సూట్ కాలేదని రాశాడు. మెక్‌డోనాల్డ్స్‌లో అత్యధికంగా అమ్ముడయే చికెన్ ఐటెం మేక్‌నగ్గెట్స్. ఈ ఐటెం సింగపూర్ మెక్‌డీలో అతనికి నచ్చలేదు. అలాగే థాయ్‌లాండ్‌లోని టూనా (చేప) పై కూడా అసహ్యంగా ఉందని రాశాడు. కోపెన్‌హేగన్‌లో లభించే హోమ్ స్టైల్ చిప్స్ బాగా నమలాల్సి వచ్చేంత గట్టిగా ఉన్నాయని, మలేసియాలో దొరికే మెక్‌ఫ్లోట్ బాగా తీపిగా, బాగా వేడిగా ఉందని రాశాడు. అన్నిటికంటే ఇతనికి నచ్చని ఐటెం సింగపూర్‌కి చెందిన బబుల్‌గం మెక్‌ఫిజ్. ఆ సిరప్ ఎంత చిక్కగా ఉందంటే ఎంత గట్టిగా పీల్చినా స్ట్రాలోంచి ఓ పట్టాన పైకి రాలేదుట.
వాల్‌స్ట్రీట్ జనరల్ అనే దినపత్రిక మెక్‌గోవన్ చేసిన ఈ కామెంట్స్ మీద మెక్‌డోనాల్డ్స్ యాజమాన్యాన్ని సంప్రదిస్తే స్పోక్‌పర్సన్ కామెంట్ చేయడానికి తిరస్కరించి ఇలా చెప్పింది.
‘మెక్‌డీ అభిమాని ప్రపంచమంతటా మా రెస్ట్‌రెంట్స్‌లో తినడానికే తిరగడం మాకు ఆనందగా ఉంది’
మెక్‌గోవన్ మంచి రివ్యూలని కూడా రాశాడు. పారిస్‌లో దొరికే ఫ్రెంచ్ 280 రిసెటీ ప్రాన్‌జెరీకి 4.5 రేటింగ్ ఇచ్చాడు. లాహితీలో దొరికే ఛీజ్ పానినికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. మెక్సికోలో దొరికే టెక్సన్ బర్గర్‌కి 4 స్టార్ రేటింగ్ ఇస్తూ అందులో వాడే హేష్ బ్రవున్స్ వల్ల అది రుచికరమైన వంటకంగా మారిందని పేర్కొన్నాడు. ఇంతదాకా ఇరవై లక్షల మంది అతని బ్లాగ్‌ని సందర్శించారు. ఆఫీస్ పని మీద వెళ్లేటప్పుడు విమానాలని మారే సమయాన్ని పెంచుకుని సమీపంలోని లేదా ఎయిర్‌పోర్ట్‌లోని మెక్‌డీలకి వెళ్లి తింటాడు. వైఫై సౌకర్యం ఉన్న ఎక్కడైనా అతను ఆఫీస్ పని చేయగలడు కాబట్టి ఇన్ని దేశాలకి వెళ్లగలిగాడు. ఇతను చూడాల్సిన దేశాల జాబితాలో బ్లాగ్‌లో ఒమన్, మంగోలియా, వియత్నాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. విశేషం ఏమిటంటే గత నాలుగేళ్లుగా మెక్‌డీలో తింటున్నా అతను బరువు పెరగలేదు. ఇంతదాకా సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్ ఖండాలని సందర్శించాడు. ఇంకా ఆఫ్రికాకి వెళ్లలేదు. శ్రీలంక మెక్‌డోనాల్డ్స్‌లో దొరికే ప్రతీ ఐటెం ది బెస్ట్ అని బ్లాగ్‌లో రాశాడు. అక్కడి సీనీ సేంబల్ బ్రేక్‌ఫాస్ట్ బర్గర్ అతనికి బాగా నచ్చిన పదార్థం. ఇతను ఇలా డబ్బుని వృధా చేయడాన్ని ఇతని భార్య పట్టించుకోదు. ఐతే ఫ్రీంక్వెట్ ఫ్లయర్ మైల్స్ ద్వారా చాలా విమాన టిక్కెట్లని ఉచితంగా సంపాదిస్తూంటాడు.
28 ఏళ్ల మేక్‌గోవన్‌ది పిచ్చికాక ఏమంటాం?
ప్రస్తుతం ఇతను బేంకాక్‌లో నివసిస్తున్నాడు.

- పద్మజ