నమ్మండి! ఇది నిజం!!

ప్రియమైన గై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్ జూలోని ఎలుగుబంటి ప్రభావంతోనే ఏ ఏ మిల్‌నే అనే రచయిత ‘విన్నీ ది ఫూ’ అనే పాత్రని సృష్టించి కథలు రాశాడు.
ఐతే లండన్ జూలోని విఐపి జంతువు ఏదో తెలుసా?
లండన్ ప్రజలందరూ ప్రేమించిన జంతువు ఏదో తెలుసా?
అది గొరిల్లా. దాని పేరు గై. 32 ఏళ్లు జీవించిన ఇది లండన్ జూకి 5 నవంబర్ 1947లో చేరుకుంది. 1978 దాకా అక్కడ జీవించింది. జూకి వచ్చినప్పుడు దాని బరువు 10 కిలోలు. అంతకు మునుపు జూలోని గొరిల్లా కింగ్ 1941లో మరణించింది. మరో గొరిల్లా కోసం జూ అధికారులు వెదకసాగారు. కలకత్తా జూలో ఉన్నదని తెలిసి దీనికి బదులుగా ఓ పులిని ఇచ్చి లండన్‌కి తెప్పించారు.
గై బరువు 1966 నించి 250 కిలోలు ఉండేది. ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. గై చూడటానికి భయంకరంగా ఉన్నా, చాలా మృదుస్వభావం గలది. చిన్న పక్షులు దాని పంజరంలోకి వస్తే వాటిని మృదువుగా పట్టుకుని పరిశీలించి వదిలేసేది. ఈ మృదు స్వభావమే లండన్ పౌరులని బాగా ఆకర్షించింది. త్వరలోనే గై బ్రిటన్‌లోని ప్రఖ్యాత జంతువుగా మారింది. 1930-1940లలో వాల్ట్ డిస్నీ జంతువుల పాత్రలతో తీసిన సినిమాల వల్ల లండన్ ప్రజలకి జంతువుల మీద ఆసక్తి కలిగిన రోజుల్లో గై జూకి వచ్చింది. త్వరలోనే అది స్టార్ ఎట్రాక్షన్‌గా మారింది. చైనా నించి వచ్చిన చీ చీ అనే జైంట్ పాండా స్థానం దీని తర్వాతే. 1950లలో కేవలం గైని చూడటానికే లండన్ జూకి ముప్పై లక్షల మంది వెళ్లారు. ఈ రోజు దాంట్లో సగం మందే వెళ్తున్నారు. గై ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలీదు గాని లండన్ జూ అధికారికంగా మే 30వ తారీఖుని దాని పుట్టిన రోజుగా ప్రకటించింది. ఏటా ఆ రోజున గైకి వందల కొద్దీ బర్త్‌డే గ్రీటింగ్ కార్డులు పోస్ట్‌లో వచ్చేవి.
జూలలో గొరిల్లాలు ఎక్కువ కాలం జీవించడం గైతోనే ఆరంభం అయింది. 1887-1908ల మధ్య లండన్ జూలో ఏడు గొరిల్లాలు మరణించాయి. గొరిల్లాలు చూడటానికి అచ్చం మనిషిలానే ఉంటాయి. కాని వాటికి కొన్ని ముఖ కండరాలు ఉండకపోవడంతో నవ్వలేవు. దాంతో అవి కోపంగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. ప్రపంచంలోని మెదడు ఎదిగిన అతి పెద్ద కోతులు గొరిల్లాలు.
లండన్ జూ డైరెక్టర్ వెస్ట్ ఆఫ్రికాలోని అడవుల్లో దీనికి జతగా ఓ ఆడ గొరిల్లాని పట్టుకోమని కోరాడు. కాని అది సాధ్యపడక పోవడంతో తమకి జంతువులని సరఫరా చేసే వ్యాపారస్థులని, ప్రపంచంలోని అన్ని జూలని గైకి జతగా ఆడ గొరిల్లా ఉంటే పంపమని కోరాడు.
లండన్ సమీపంలోని ఛెస్టింగ్టన్ జూలోనే ఐదేళ్ల వయసుగల లోమీ అనే ఓ ఆడ గొరిల్లా ఉందని తెలిసి దాన్ని రప్పించారు. లండన్ జూలోని మంకీ హౌస్‌లో అది ఓ ఏడాది నివసించాక 1971లో దాన్ని మైఖేల్ సోబెల్ పవిలియన్‌లో గైకి పరిచయం చేశారు. ఐతే పాతికేళ్లు ఒంటరిగా గడిపిన గైకి, లోమీకి సంతానం కలగలేదు.
1968లో 2001 ఏ స్పేస్ ఒడెసి అనే హాలీవుడ్ సినిమా విడుదలైంది. దాంట్లో ఏప్ మేన్‌గా నటించిన డేస్ రెక్టర్ లండన్ జూలోని గై ప్రవర్తనని నిశితంగా పరిశీలించి ఆ పాత్రలో ప్రతిభావంతంగా నటించాడు.
ఆఫ్రికా నించి జంబో పేరుగల ఏనుగు లండన్ జూకి వచ్చినా ప్రజలు గైని చూడటానికే క్యూ కట్టేవారు.
ప్రజలకి గై మీదున్న ఆ ప్రేమే దాన్ని చంపింది. స్వీట్స్, ఫ్రూట్స్, పైస్, ఐస్‌క్రీమ్స్, బ్రెడ్, జామ్ లాంటివి సందర్శకులు తెచ్చి దానికి తినిపించేవారు. దాంతో గైకి పళ్ల వ్యాధి వచ్చింది. 1978లో తన 32వ ఏట పళ్లకి వచ్చిన ఇన్‌ఫెక్షన్‌కి ఆపరేషన్ చేస్తున్నప్పుడు గై ఎనస్థీషియాలో ఉండగానే హార్ట్ అటాక్‌తో మరణించింది.
మరణానంతరం కూడా అది ప్రజలని ఆకర్షిస్తోంది. టేక్సీ డెర్మిలిస్ట్ ఆర్థర్ హేవార్డ్ దాని శరీరంలోని రక్తమాంసాలు తొలగించి లోపల గడ్డిని కూరాడు. ఈ పని పూర్తవడానికి అతనికి తొమ్మిది నెలలు పట్టింది. 1982 నించి దీన్ని నేషనల్ హిస్టరీ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంచారు. ఐతే చాలామంది దీన్ని నిరసిస్తూ జూకి, మ్యూజియానికి, పత్రికలకి ఉత్తరాలు రాశారు. 1961లో క్రిస్టల్ పేలెస్ పార్క్‌లో డేవిడ్ వైన్ అనే శిల్పి గై విగ్రహాన్ని చేసి నెలకొల్పాడు. మరో విగ్రహాన్ని గై జ్ఞాపకార్థం లండన్ జూ ప్రవేశ ద్వారం దగ్గర కూడా ఉంచారు. అది ఇత్తడి విగ్రహం.
ప్రపంచంలో ఇంత పాపులారిటీ మరే జూలోని జంతువుకీ అంతకు ముందు కాని, ఆ తర్వాత కాని రాలేదు.

-పద్మజ