తెలంగాణ

రిజర్వేషన్లు అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: దేశ వ్యాప్తంగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించవలసిన అవసరం ఉందని కేంద్ర సామాజిక న్యా యం, సాధికారత మంత్రి రాందాస్ అథావలే అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఏపీ భవన్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రజతోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఏపీ ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఎస్సీ కో-ఆపరేటివ్ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, ఏపీ భవన్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు అనందరావు, లింగరాజులు తదితరులు పాల్గొన్న ఈ వేడుకల్లో మంత్రి రాందాస్ అథావలే మాట్లాడుతూ రిజర్వేషన్లు దాని ఫలాలు దేశంలో అట్టడుగు వర్గాలకు అందినప్పుడు మాత్రమే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయని అన్నారు. అలాగే రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న అట్టడుగు వర్గాలకు రాజ్యాంగం హక్కుగా కల్పించిన రిజర్వేషన్ ఫలాలు అందాలని వెల్లడించారు.