అంతర్జాతీయం

ఉగ్రవాదంపై సంయుక్త పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్, మే 23: ఉగ్రవాదం, అతివాదంపై కలసికట్టుగా పోరాడాలని భారత్, ఇరాన్ నిశ్చయించుకున్నాయి. అవసరమైన సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం ఇరాన్‌లో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆ దేశ అధ్యక్షుడు హుస్సేన్ రౌహానీతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదం, అతివాదం, అస్థిరత వ్యాప్తి చెందడం తదితర అంశాలపై వీరు ఈ సందర్భంగా చర్చించారు. ఇదే అంశంపై గత ఏడాది రష్యాలోని ఉఫాలో చర్చలు జరిపిన మోదీ, రౌహానీ ప్రస్తుతం ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలకు పెను సవాళ్లు విసురుతున్న ఉగ్రవాదం, అతివాదంపై అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ప్రాంతీయంగా ఆర్థికాభివృద్ధితోపాటు శాంతి, సుస్థిరతలను పెంపొందించేందుకు భారత్, ఇరాన్ ఎనలేని కృషి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాద, అతివాద శక్తులతోపాటు అస్థిరత వ్యాప్తి చెందుతుండటం పట్ల ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి’ అని ఇరాన్ నాయకులతో ద్వైపాక్షిక, ప్రతినిధుల స్థాయి చర్చలు ముగిసిన అనంతరం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం నుంచి ఎదురవుతున్న సవాళ్లపై పోరాడటంతోపాటు మాదక ద్రవ్యాల రవాణాను, సైబర్ నేరాలను నిరోధించేందుకు నిరంతరం సన్నిహిత సంప్రదింపులు జరపాలని భారత్, ఇరాన్ అంగీకారానికి వచ్చాయని, అలాగే ప్రాంతీయ, నౌకాయాన భద్రతకు సంబంధించి భారత్, ఇరాన్ రక్షణ, భద్రతా సంస్థల మధ్య సంప్రదింపులను పెంపొందించాలని ఇరు దేశాలు నిర్ణయించాయని మోదీ వివరించారు. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాడేందుకు పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని భారత్, ఇరాన్ అంగీకారానికి వచ్చాయని రౌహానీ తెలిపారు.

చిత్రం టెహ్రాన్‌లో సోమవారం ఇరాన్ అధ్యక్షుడు హుస్సేన్ రౌహానీతో సమావేశమైన మోదీ