అంతర్జాతీయం

వివాదాన్ని రగిలించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, నవంబర్ 20: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన అక్కసును చాటుకుంది. ఈ ప్రాంతంపై మొదటినుంచీ వివాదాన్ని రేకెత్తిస్తూ వచ్చిన డ్రాగన్, తాజాగా భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించడంపైనే అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ విషయంలో ఉన్న సరిహద్దు వివాదాన్ని భారతదేశం జఠిలం చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలక దశలో ఉన్న తరుణంలో ఈ రకమైన వివాదాస్పద చర్యలను భారత్ కట్టిపెట్టాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిథి లూకాంగ్ సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో అన్నారు. సరిహద్దు వివాదం విషయంలో మొదటినుంచీ కూడా చైనా ఓ స్పష్టమైన, నిర్దిష్టమైన వైఖరినే అవలంభిస్తూ వచ్చిందని వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చైనా పేర్కొంటున్న నేపథ్యంలో భారత రాష్టప్రతి పర్యటనపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చర్చలు, సంప్రతింపుల ద్వారా ఈ వివాదాస్పద అంశాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలూ ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నా చైనా విదేశాంగ ప్రతినిధి ‘ఉభయ దేశాలకూ ఆమోదయోగ్యమైన రీతిలోనే సహేతుక పరిష్కార దిశగా అడుగలు వేస్తున్నాం’ అని తెలిపారు. సమస్య పరిష్కారం కాకుండా దాన్ని మరింత జఠిలం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని, తుది నిర్ణయం వెలువడే వరకూ శాంతి సామరస్య వాతావరణాన్ని కాపాడుకోవాలని తెలిపారు.

చిత్రం..అరుణాచల్‌ప్రదేశ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్