అంతర్జాతీయం

నేపాల్ బంద్ ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత పర్యాటక బస్సు దగ్ధం
ఖాట్మండు, నవంబర్ 30: ఆందోళనలతో నేపాల్ అట్టుడుకుతోంది. నేపాల్‌లోని వాణిజ్య కేంద్రాలకు భారత్ నిత్యావసరాలు రవాణా నిలిపివేయడాన్ని నిరసిస్తూ నెట్రావిక్రమ్ చంద్ నాయకత్వంలోని సిపిఎన్-మావోయిస్టు పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆదివారం భారత్ నుంచి ప్రసారయ్యే అన్ని న్యూస్‌చానల్స్ కార్యక్రమాలు ఆందోళనకారులు నిలిపివేశారు. ఇలా ఉండగా దక్షిణ నేపాల్‌లోని పోఖారాలో భారత్‌కు చెందిన ఓ పర్యాటక బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. నంబర్‌ప్లేట్ ఆధారంగా దగ్ధమైన బస్సు భారత్‌దని నిర్ధారించారు. బంద్ సందర్భంగా ఆందోళనకారులు పలుచోట్ల హింసకు పాల్పడినట్టు తెలిసింది.