అంతర్జాతీయం

‘ఆత్మ’లకూ పెళ్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 15: పెళ్లికాని ఓ యువకుడు మూడేళ్ల క్రితం మరణించాడు. పెళ్లికాని మరో యువతి ఇటీవలే గతించింది. అయితేనేం... వారిద్దరికీ ఆదివారం పెళ్లి జరిగింది. ఆశ్చర్యంగానూ, భయం కలిగించేదిగానూ ఉంది కదూ... ఒక్క ముక్కలో చెప్పాలంటే అది ‘ఆత్మల వివాహం’... ఇంకా చెప్పాలంటే ‘మరణానంతర వివాహం’! ఇది చైనా గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగుతున్న ఈ ఆచారం అతి ప్రాచీనమైనదే కాదు, ప్రసిద్ధి చెందింది కూడా. చైనా గ్రామీణ ప్రాంతమైన షాంగ్జిలో నివసించే ఓ సామాన్య రైతు ‘వరుడి’ కుటుంబం ఈ ‘పెళ్లి’ ఖర్చుల కింద 27వేల డాలర్లు సమర్పించుకుంది. స్థానికులు కావడంతో తక్కువ ఖర్చులోనే ఈ ‘తంతు’ పూర్తయింది. పెళ్లి కాకుండా ఓ యువకుడు మరణిస్తే ఆ కుటుంబానికి అరిష్టం చుట్టుకుంటుందని అక్కడి ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసం అక్కడి జ్యోతిష్కులకు కాసుల పంట పండిస్తోంది. ఎంత ఖర్చయినాసరే వెనుకాడని విశ్వాసం వారిది. షాంగ్జి గనుల్లో పనిచేసే యువకులు యుక్త వయసులోనే చనిపోతున్నారు. దీంతో యువతులకన్నా యువకులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. మరణానంతర వివాహాలకు యువతుల శవాలు దొరకడం ఇటీవలి కాలంలో కష్టంగా మారింది. ప్రజల నమ్మకం మాట ఎలా వున్నా ‘ఆత్మల వివాహం’ వినడానికి కొంచెం భయం గొలిపేదే!