అంతర్జాతీయం

కామెరాన్ భవితవ్యం ప్రశ్నార్థకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 30: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతుందా లేదా అన్నదానిపై అంతర్జాతీయంగా చర్చలు చెలరేగుతున్న నేపథ్యంలో బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ నాయకత్వానికి తీవ్రసవాళ్లు ఎదురవుతున్నాయి. వచ్చేనెల 23న ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరగబోతోంది. ఐరోపా యూనియన్‌లో యునైటెడ్ కింగ్‌డమ్ సభ్యత్వం విషయంలో కామెరాన్ వ్యవహరించిన తీరు అసంబద్ధంగా ఉందంటూ అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఐరోపా యూనియన్‌లో బ్రిటన్ సభ్యత్వాన్ని కాపాడే దిశగా ఆయన వ్యూహాత్మక చర్యలు చేపట్టకపోతే కన్జర్వేటివ్ పార్టీ నేతగానే కాకుండా బ్రిటన్ ప్రధానిగా కూడా కామెరాన్ భవితవ్యం ప్రశ్నార్థకమవుతుందని రెబల్ ఎంపీలు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయాత్మక మెజారిటీతో ఐరోపా యూనియన్‌లో బ్రిటన్ సభ్యత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కామెరాన్‌పై ఉందని తెలిపారు.
ఒకవేళ ఈ మెజారిటీ ఏమాత్రం తగ్గినా లేదా ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలకతప్పని పరిస్థితి ఎదురైనా కామెరాన్ నాయకత్వానికి అంతిమగడియలు ఆసన్నమైనట్టేనని టోరీ ఎంపీ నాడైన్ డోరిస్ స్పష్టం చేశారు. అలాగే ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని బలపరుస్తున్న మరో పార్టీ ఎంపీ యాండ్రూ బ్రిడ్జన్ కూడా కామెరాన్ ప్రకటనలపై విరుచుకుపడ్డారు. ఎంతమంది తన ప్రతిపాదనలను బలపరుస్తారన్న విషయంలో స్పష్టత లేకుండా చాలా తీవ్రస్థాయిలోనే కామెరాన్ ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆయన మద్దతుదారుల సంఖ్య మరింతగా తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే బ్రెడ్జిట్ విషయంలో కన్జర్వేటివ్ పార్టీ నిలువునా చీలిపోయిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రిస్మస్‌లోగానే జాతీయ ఎన్నికలు నిర్వహించి ప్రజాభిప్రాయం కోరాలని తెలిపారు. రిఫరెండం తరువాత కామెరాన్ నాయకత్వంపైనే ఓటింగ్ జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.